విజయ్‌ ప్రభుత్వంపై.. నో కామెంట్స్‌ | latha rajinikanth comments on cm vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రభుత్వంపై.. నో కామెంట్స్‌

Jun 15 2026 12:30 PM | Updated on Jun 15 2026 12:34 PM

latha rajinikanth comments on cm vijay

సాక్షి, చెన్నై:  రజనీకాంత్‌ గొప్ప నాయకుడు అని, ఆయన 2021లో రాజకీయాలలోకి రాక పోవడం తనకు కొంచెం బాధ కలిగించిందని ఆయన సతీమణి లతా రజనీ కాంత్‌ వ్యాఖ్యానించారు. ఆమె తమిళనాట ఓ సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఆదివారం ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రజనీ కాంత్‌ గొప్ప నాయకుడు అని ఆయన  రాజకీయాలలోకి రాక పోవడం పెద్ద లోటుగా వ్యాఖ్యలు చేశారు. 

2021లో ఆయన రాలేదన్న కారణం పక్కన పెడితే కొంత బాధగా అనిపించిందన్నారు. ఆయన వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అని్పస్తున్నదన్నారు.  ఎందు కంటే ఆయన లో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని, ఆయనలో ఎన్నోకలలు ఉన్నాయని పేర్కొంటూ దురదృష్ట వశాత్తు కోవిడ్‌ కాలంలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.ఒక రాష్ట్రం ఎలా ఉండాలోఆయన ప్రణాళిక వేసుకున్నారని, ఆయన దార్శనికత తనకు తెలుసునని, మనం  ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయామని్పస్తుందన్నారు.  

నో కామెంట్స్‌  
తమిళనాడు సీఎం విజయ్‌ నేతృత్వంలోని 30 రోజుల ప్రభుత్వంపై తాను ఇప్పడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వ్యాఖ్యానించారు. ఒక సాధారణ పౌరురాలిగా, తాను  తమిళనాడులో జరుగుతున్న అన్ని రాజకీయ, సామాజిక పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నానని,  అయితే, ప్రభుత్వం ఏర్పాటై చాలా తక్కువ సమయం మాత్రమే అయ్యిందన్నారు. ఇంత తక్కువ సమయంలో తాను ఈ ప్రభుత్వం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను.. చేయను కూడ్ఙా అని ఆమె పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement