జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌: లష్కరే తోయిబా కమాండర్‌ హతం | Lashkar Commander Uzair Khan Killed | Sakshi
Sakshi News home page

లష్కరే తోయిబా కమాండర్‌ హతం.. ఏడు రోజుల ఎన్‌కౌంటర్‌కు ముగింపు

Sep 19 2023 4:59 PM | Updated on Sep 19 2023 5:12 PM

Lashkar Commander Uzair Khan Killed - Sakshi

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ అనంతనాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ ఉజ్జైర్ ఖాన్‌ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు.  పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అనంతనాగ్‌లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి: ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌.. హత్య

Advertisement
 
Advertisement
Advertisement