ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌.. హత్య

Indian Army soldier abducted and killed in Manipur - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్‌ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్‌ పశి్చమ జిల్లా తరుంగ్‌ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్‌థంగ్‌ కొమ్‌.. కంగ్‌పొక్పి జిల్లా లీమఖోంగ్‌లోని ఆర్మీ డిఫెన్స్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ప్లటూన్‌లో విధులు నిర్వర్తిస్తన్నారు.

కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు.  ఆదివారం ఉదయం ఖునింగ్‌థెక్‌ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్‌ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top