భూమికి ఆధార్‌ లాంటి గుర్తింపు  | land records have been digitized under the Digital India Land Records Modernization Programme | Sakshi
Sakshi News home page

భూమికి ఆధార్‌ లాంటి గుర్తింపు 

Sep 12 2026 6:35 AM | Updated on Sep 12 2026 6:35 AM

land records have been digitized under the Digital India Land Records Modernization Programme

డీఐఎల్‌ఆర్‌ఎంపీ 3.0 మార్గదర్శకాలు జారీ 

అన్ని భూ రికార్డులు ఒక్క దగ్గరకు 

రిజి్రస్టేషన్‌ సేవా కేంద్రాలుగా 75 రిజిస్ట్రార్‌ కేంద్రాలు

న్యూఢిల్లీ: వ్యక్తులకు ఉన్నట్లే ఇకపై భూములకు ప్రత్యేక ఆధార్‌ లాంటి గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఒక్క అంకెతో ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ... ఆ భూమి ఎక్కడ ఉంది? హద్దులేమిటి? యజమాని ఎవరు? వంటి వివరాలన్నీ తెలుసుకోగలదు. భూమి రికార్డుల ఆధునికీకరణ, డిజిటలీకరణ మూడో దశ కార్యక్రమాని (డీఐఎల్‌ఆర్‌ఎంపీ 3.0) కి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం ఇందుకు కారణం... 2026–31 మధ్యకాలంలో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు రూ.565.5 కోట్ల ఖర్చు చేయనున్నారు. 

ఇందులో భాగంగా భూమి రికార్డులు, మ్యాపులు, రిజిస్ట్రేషన్ల తాలూకూ వివరాలన్నీ ఒక దగ్గరకు చేర్చనున్నారు. జీఐఎస్‌ ఆధారిత డిజిటల్‌ ప్రేమ్‌వర్క్‌ ద్వారా భూమికి సంబంధించిన సమీకృత రికార్డులను సృష్టించనున్నారు. ఇది వ్యక్తుల రికార్డులను డిజిటలీకరించడం కాదని, సమీకృత భూ నిర్వహణ వ్యవస్థ అని మార్గదర్శకాల జారీ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ‘‘భూమి అంటే మట్టి ముక్క కాదు. మన రైతుల ఆత్మగౌరవం. పూర్వీకులిచ్చిన ఆశీర్వాదం. భవిష్యత్తు తరాల ఉనికికి నిదర్శనం’’అని ఆయన వ్యాఖ్యానించారు.  

డీఐఎల్‌ఆర్‌ఎంపీ 3.0 కింద ప్రతి రాష్ట్రం తనదైన ‘ల్యాండ్‌ స్టాక్‌’అభివృద్ధి చేసుకోవచ్చు. భూమికి సంబంధించి డేటాసెట్స్, వ్యవస్థలను ఏపీఐల ద్వారా ఒక దగ్గరకు చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ల్యాండ్‌ స్టాక్‌లు కాస్తా జాతీయ ల్యాండ్‌ స్టాక్‌కు ఆధారంగా మారుతుంది. రాష్ట్రాలు, కేంద్రాలు రెండింటికీ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సమాచారం తాలూకూ యాజమాన్యం, ని యంత్రణ మాత్రం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి భూమికి 14 అంకెల బీహెచ్‌యూ–ఆధార్‌ నంబర్‌ ఒకదాన్ని కేటాయిస్తారు. 

ఇంకోలా చెప్పాలంటే మీ భూమిని గుర్తించేందుకు ప్రత్యేకమైన అంకె ఒకటి అందుబాటులోకి వస్తుందన్నమాట. దీని ద్వారా భూమి యజమాని, హ ద్దులను సులువుగా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యధికంగా రిజి్రస్టేషన్లు జరిగే 75 రిజి్రస్టార్‌ కార్యాలయాలను ‘‘రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు’’గా ఆధునికీకరించనున్నారు. అచ్చం పాస్‌పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా అన్నమాట. దీంతోపాటే ప్రభుత్వం పాత భూమి రికార్డులను స్కానింగ్‌ చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. రిజి్రస్టేషన్ల సమాచారం, రెవెన్యూ కోర్టుల కంప్యూటరీకరణ ద్వారా దీన్ని సాధ్యం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement