breaking news
land parcels
-
భూమికి ఆధార్ లాంటి గుర్తింపు
న్యూఢిల్లీ: వ్యక్తులకు ఉన్నట్లే ఇకపై భూములకు ప్రత్యేక ఆధార్ లాంటి గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఒక్క అంకెతో ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ... ఆ భూమి ఎక్కడ ఉంది? హద్దులేమిటి? యజమాని ఎవరు? వంటి వివరాలన్నీ తెలుసుకోగలదు. భూమి రికార్డుల ఆధునికీకరణ, డిజిటలీకరణ మూడో దశ కార్యక్రమాని (డీఐఎల్ఆర్ఎంపీ 3.0) కి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం ఇందుకు కారణం... 2026–31 మధ్యకాలంలో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు రూ.565.5 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా భూమి రికార్డులు, మ్యాపులు, రిజిస్ట్రేషన్ల తాలూకూ వివరాలన్నీ ఒక దగ్గరకు చేర్చనున్నారు. జీఐఎస్ ఆధారిత డిజిటల్ ప్రేమ్‌వర్క్ ద్వారా భూమికి సంబంధించిన సమీకృత రికార్డులను సృష్టించనున్నారు. ఇది వ్యక్తుల రికార్డులను డిజిటలీకరించడం కాదని, సమీకృత భూ నిర్వహణ వ్యవస్థ అని మార్గదర్శకాల జారీ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘‘భూమి అంటే మట్టి ముక్క కాదు. మన రైతుల ఆత్మగౌరవం. పూర్వీకులిచ్చిన ఆశీర్వాదం. భవిష్యత్తు తరాల ఉనికికి నిదర్శనం’’అని ఆయన వ్యాఖ్యానించారు. డీఐఎల్ఆర్ఎంపీ 3.0 కింద ప్రతి రాష్ట్రం తనదైన ‘ల్యాండ్ స్టాక్’అభివృద్ధి చేసుకోవచ్చు. భూమికి సంబంధించి డేటాసెట్స్, వ్యవస్థలను ఏపీఐల ద్వారా ఒక దగ్గరకు చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ల్యాండ్ స్టాక్‌లు కాస్తా జాతీయ ల్యాండ్ స్టాక్‌కు ఆధారంగా మారుతుంది. రాష్ట్రాలు, కేంద్రాలు రెండింటికీ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సమాచారం తాలూకూ యాజమాన్యం, ని యంత్రణ మాత్రం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి భూమికి 14 అంకెల బీహెచ్‌యూ–ఆధార్ నంబర్ ఒకదాన్ని కేటాయిస్తారు. ఇంకోలా చెప్పాలంటే మీ భూమిని గుర్తించేందుకు ప్రత్యేకమైన అంకె ఒకటి అందుబాటులోకి వస్తుందన్నమాట. దీని ద్వారా భూమి యజమాని, హ ద్దులను సులువుగా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యధికంగా రిజి్రస్టేషన్లు జరిగే 75 రిజి్రస్టార్ కార్యాలయాలను ‘‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’’గా ఆధునికీకరించనున్నారు. అచ్చం పాస్‌పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా అన్నమాట. దీంతోపాటే ప్రభుత్వం పాత భూమి రికార్డులను స్కానింగ్ చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. రిజి్రస్టేషన్ల సమాచారం, రెవెన్యూ కోర్టుల కంప్యూటరీకరణ ద్వారా దీన్ని సాధ్యం చేయనున్నారు. -
22ఏ నిషేధిత జాబితా నుంచి 51,603 ఎకరాల తొలగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఆధీనంలో ఉన్న 51,603.46 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టం–1908 సెక్షన్ 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆ భూములను పూర్తిగా ఏపీఐఐసీ పేరు మీదకు మార్చడానికి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ స్వాధీనంలో 70,000 ఎకరాలు ఉన్నప్పటికీ, పరిహారం చెల్లించిన 51,603.46 ఎకరాలకు సంబంధించి ఇంకా రెవెన్యూ, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో మ్యుటేషన్ జరగలేదని పేర్కొన్నారు. దీనివల్ల వివిధ సంస్థలతో ఏపీఐఐసీ అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతుందని, ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి తక్షణమే ఏపీఐఐసీ పేరు మీదకు బదలాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలోఅత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 11,862.11 ఎకరాలు ఉండగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 10,403.92 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 4,172.18 ఎకరాల భూములు ఉన్నాయి. అతి తక్కువగా పొలవరం జిల్లాలో 19.61 ఎకరాలు ఉన్నాయి. చదవండి: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకే రూ.401.54 కోట్లు! -
మరోసారి సహారా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: సహారాగ్రూపు ఆస్తులను స్వాధీనం చేసుకునే లక్ష్యంలో భాగంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహారా కుచెందిన 5 భూముల (ల్యాండ్ పార్సిల్స్) వేలానికి రంగం సిద్ధం చేసింది. వీటి రిజర్వు ధర రూ.130కోట్లుగా సెబీ అంచనా వేసింది. ఎస్బిఐ క్యాప్స్ ఆధ్వర్యంలో డిశెంబర్ 28న మూడు ఆస్తులను వేలం నిర్వహించనుంది. వీటి రిజర్వు ధర రూ. 102 కోట్లు. అలాగే డిశెంబర్ 27న హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ రూ.29 కోట్లకు రిజర్వ్ ధరకు గాను మరో రెండు ప్రాపర్టీలను వేలం వేయనుంది. ఈ విషయాలను మార్కెట్ రెగ్యులేటరీ స్టాక్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సెబీ వేర్వేరు నోటీసుల్లో వెల్లడించింది. ఈ వేలానికి తేదీలను ప్రకటించింది. ఈ ప్రక్రియను ఎస్బిఐ క్యాప్, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీకి అప్పగించింది. నిబంధనలకు విరుద్దంగా రూ.25,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన సహారా గ్రూపు వాటిని చెల్లించడంలో విఫలైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 61 సహారా ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.6,500 కోట్ల నిధులను సేకరించనుంది. ఈ నిధుల రికవరీకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా ఆస్తులను సెబీ వేలం వేస్తోంది. ఇందుకుగాను ఎస్బిఐ కాపిటల్ మార్కెట్స్, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీలకు ఈ బాధ్యతలను అప్పగించింది. గత జులైలో ప్రకటించిన 58 ఆస్తులకు, అక్టోబర్ లో 13 ఆస్తుల వేలానికి ఇవి అదనం. కాగా ఈ కేసులో సహారా చీఫ్ సుబ్రతో రాయ్ జైలు కెళ్లారు. అయితే ఇటీవల ఆయన తల్లి మరణంతో పెరోల్‌పై విడుదలయ్యారు. వివిధ షరతుల మీద సుప్రీం ఆయన పెరోల్ ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.


