మరోసారి సహారా ఆస్తుల వేలం | Sakshi
Sakshi News home page

మరోసారి సహారా ఆస్తుల వేలం

Published Fri, Nov 18 2016 2:30 PM

Sebi to auction Sahara group's 5 more land parcels

న్యూఢిల్లీ: సహారాగ్రూపు ఆస్తులను స్వాధీనం చేసుకునే లక్ష్యంలో భాగంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహారా కుచెందిన  5 భూముల (ల్యాండ్ పార్సిల్స్) వేలానికి  రంగం సిద్ధం చేసింది.  వీటి రిజర్వు ధర రూ.130కోట్లుగా సెబీ అంచనా వేసింది. ఎస్‌బిఐ క్యాప్స్‌ ఆధ్వర్యంలో డిశెంబర్ 28న మూడు ఆస్తులను వేలం నిర్వహించనుంది.  వీటి రిజర్వు ధర రూ. 102 కోట్లు.  అలాగే డిశెంబర్ 27న హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ   రూ.29 కోట్లకు  రిజర్వ్ ధరకు గాను మరో  రెండు  ప్రాపర్టీలను వేలం వేయనుంది. ఈ విషయాలను  మార్కెట్ రెగ్యులేటరీ స్టాక్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) సెబీ వేర్వేరు నోటీసుల్లో వెల్లడించింది.  ఈ వేలానికి తేదీలను ప్రకటించింది. ఈ ప్రక్రియను ఎస్‌బిఐ క్యాప్‌, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీకి అప్పగించింది.
నిబంధనలకు విరుద్దంగా రూ.25,000 కోట్లకు  పైగా నిధులు సమీకరించిన సహారా గ్రూపు  వాటిని చెల్లించడంలో విఫలైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 61 సహారా ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.6,500 కోట్ల నిధులను సేకరించనుంది. ఈ నిధుల రికవరీకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా ఆస్తులను సెబీ వేలం వేస్తోంది.  ఇందుకుగాను ఎస్‌బిఐ కాపిటల్‌ మార్కెట్స్‌, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీలకు ఈ బాధ్యతలను అప్పగించింది. గత జులైలో ప్రకటించిన 58 ఆస్తులకు, అక్టోబర్ లో 13 ఆస్తుల వేలానికి ఇవి అదనం.  
కాగా  ఈ కేసులో సహారా చీఫ్ సుబ్రతో రాయ్ జైలు కెళ్లారు.  అయితే ఇటీవల ఆయన తల్లి మరణంతో  పెరోల్‌పై విడుదలయ్యారు.  వివిధ షరతుల మీద సుప్రీం ఆయన పెరోల్ ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.  
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement