కుంభమేళా ఎఫెక్ట్‌.. గంగా హారతి నిలిపివేత | Prayagraj Kumbh Mela Stampede Effect Ganga Arti In Varanasi Stopped, More Details Inside | Sakshi
Sakshi News home page

కుంభమేళా ఎఫెక్ట్‌.. కాశీలో గంగా హారతి నిలిపివేత

Jan 31 2025 7:02 PM | Updated on Jan 31 2025 8:12 PM

Kumbhmela Effect Ganga Arti In Varanasi Stopped

ప్రయాగ్‌రాజ్‌: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్‌ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.

కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్‌ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్‌లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.

మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన  నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం​ పలు కీలక నిర్ణయాలు తీస‍కుంది. 

ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్‌ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement