Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు | key decision on Union Cabinet meeting today | Sakshi
Sakshi News home page

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Apr 9 2025 3:25 PM | Updated on Apr 9 2025 5:50 PM

key decision on Union Cabinet meeting today

ఢిల్లీ : కార్గో,ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్‌లో మరో అదనపు రైల్వే లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. 

బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ  రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. 

తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 

తిరుపతి - పాకాల -కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్ కు కేబినెట్ ఆమోదం

👉పీఎంకేఎస్‌వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్  ఏరియా అభివృద్ధికి  కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement