ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి

Job lost in lockdown, Woman Techie Jumps from 24th Floor - Sakshi

చెన్నై: ఉద్యోగం లేదు..పెళ్లి కాలేదు.. అనే తీవ్ర మనో వేదనలో ఉన్న ఓ యువతి శనివారం వేకువజామున 24వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఓఎంఆర్‌ రోడ్డులోని కేలంబాక్కంలో 30 అంతస్తుల భవనం ఉంది. ఇందులో 24వ అంతస్తులో విలియం జేమ్స్, ఆయన కుమార్తె జెనీఫర్‌(35) నివాసం ఉంటున్నారు. ఇది వరకు జెనీఫర్‌ ఓ ఐటీ సంస్థలో పనిచేసేవారు. కరోనా పరిస్థితుల తర్వాత ఉద్యోగం కోల్పోయింది. దీంతో మరో ఉద్యోగం కోసం ఏడాది కాలంగా ఆమె తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు.

చదవండి: (ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..)

అయితే ఉద్యోగం దొరక్క పోవడం, వయస్సు మీద పడ్డా పెళ్లి కాక పోవడం వంటి పరిస్థితులు ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేశాయి. రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు వెళ్లినా, అవకాశం దక్కక పోవడంతో ఆమె మరింత మనో వేదనకు గురయ్యారు. శుక్రవారమంతా గదికే ఆమె పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో శనివారం వేకువ జామున 3గంటల సమయంలో గది కిటికీ గుండా ఆమె కిందకి దూకేసింది. శబ్ధం విన్న సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీయగా.. అప్పటికే ఆమె శరీరం ఛిద్రమైంది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించింది. కేలంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసిన మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top