job Related issue
-
దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
భారత్‌లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.ప్రయోజనాలకే ప్రాధాన్యతఏఓన్ రిపోర్ట్‌లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.వెల్నెస్ ప్రోగ్రామ్‌లకు ప్రాముఖ్యతకొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్‌ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్‌ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేతఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. -
అల్ట్రా టెక్ సిమెంట్ ఘటన.. రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం
-
SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది. -
ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి
చెన్నై: ఉద్యోగం లేదు..పెళ్లి కాలేదు.. అనే తీవ్ర మనో వేదనలో ఉన్న ఓ యువతి శనివారం వేకువజామున 24వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఓఎంఆర్ రోడ్డులోని కేలంబాక్కంలో 30 అంతస్తుల భవనం ఉంది. ఇందులో 24వ అంతస్తులో విలియం జేమ్స్, ఆయన కుమార్తె జెనీఫర్(35) నివాసం ఉంటున్నారు. ఇది వరకు జెనీఫర్ ఓ ఐటీ సంస్థలో పనిచేసేవారు. కరోనా పరిస్థితుల తర్వాత ఉద్యోగం కోల్పోయింది. దీంతో మరో ఉద్యోగం కోసం ఏడాది కాలంగా ఆమె తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. చదవండి: (ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..) అయితే ఉద్యోగం దొరక్క పోవడం, వయస్సు మీద పడ్డా పెళ్లి కాక పోవడం వంటి పరిస్థితులు ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేశాయి. రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు వెళ్లినా, అవకాశం దక్కక పోవడంతో ఆమె మరింత మనో వేదనకు గురయ్యారు. శుక్రవారమంతా గదికే ఆమె పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో శనివారం వేకువ జామున 3గంటల సమయంలో గది కిటికీ గుండా ఆమె కిందకి దూకేసింది. శబ్ధం విన్న సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీయగా.. అప్పటికే ఆమె శరీరం ఛిద్రమైంది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించింది. కేలంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసిన మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస
సాక్షి, విజయవాడ: జిల్లాలోని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ షేర్వాన్ ఛాంబర్లో బైఠాయించడంతో రసాభాస చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ ఏ అధికారంతో విధులు నిర్వర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాక అతని అపాయింట్మెంట్కు సంబంధించిన ఆధారాలు చూపాలని వీరంగం సృష్టించారు. షేర్వాన్ దీంతో వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో జూలై 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డు మెంబర్స్‌తో కూడిన ఫోరమ్ లేని కారణంగా షేర్వాన్ అనే బోర్డు మెంబర్ తన పనిని అడ్డుకుంటున్నారని వివరించారు. హైకోర్టు ప్రొసీడింగ్ ప్రకారమే తాను విధులలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నానని, అయితే తన విధులకు షేర్వాన్ ఆటంకం కలిగిస్తున్నాడని ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగి
* 2020 నాటికి ఈ పరిస్థితి తప్పదు * సీఎస్ఐ ఎన్ఐసీ-2016 సదస్సు హెచ్చరిక * అంతర్జాతీయ మార్కెట్లో 4 దేశీయ స్టెంట్లకు గుర్తింపు సాక్షి, హైదరాబాద్: 2020 నాటికి దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడే ప్రమాదం ఉందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)-నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్ఐసీ)-2016 సదస్సు హెచ్చరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 17-18 శాతం వివిధ రకాల హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో భారీ నష్టాలనే చవిచూడాల్సి వస్తోందని పేర్కొంది. శనివారం హెచ్ఐసీసీలో ప్రారంభమైన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)- నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్ఐసీ)-2016 సదస్సుకు దేశవిదేశాల నుంచి 2,500 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగంలో అందివచ్చిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, యాంజియోప్లాస్టీ ప్రొసీజర్స్ టెక్నిక్స్ వంటి అంశాలపై ఆయా రంగాల నిపుణులు చర్చించారు. గత ఏడాది యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో 40 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 70 ఏళ్లలోపు వారు 75 శాతం.. ఆ తర్వాత ఏజ్‌గ్రూప్ వారు మరో 15 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. 3.5లక్షల మందికి యాంజియోప్లాస్టీ: ఎన్ఎన్ ఖన్నా, చైర్మన్, ఎన్ఐసీ హృద్రోగ సమస్యలను అంచనా వేసేందుకు నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2015లో దేశవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టాం. 630 ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించాం. గత ఏడాది 3.5 లక్షల మంది హృద్రోగులకు యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ చేసినట్లు తేలింది. మరో 4.75 లక్షల మంది రోగులు స్టెంట్లు వేయించుకున్నారు. వీరిలో 95 శాతం మంది డ్రగ్ కొటేడ్ స్టెంట్లు వేయించుకున్నట్లు స్పష్టమైంది. దేశీయ స్టెంట్లే ఉత్తమం: జె.శివకుమార్, ఆర్గనైజింగ్ కార్యద ర్శి, ఎన్ఐసీ దేశంలో 9 కంపెనీలు స్టెంట్లను తయారు చేస్తుండగా, వీటిలో ఇప్పటికే 4 కంపెనీల స్టెంట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నట్లు గుర్తింపు లభించింది. ఇక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాలకు స్టెంట్లు ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా దేశానికి ఏటా 32 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. చాలామంది ఇప్పటికీ విదేశీ స్టెంట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. నిజానికి దేశీయ డ్రగ్ కొటెడ్ స్టెంట్లే ఉత్తమం. జీవనశైలిలో మార్పు వల్లే: ఎస్.గుహ, అధ్యక్షుడు, ఎన్ఐసీ ప్రస్తుతం హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 60-70 ఏళ్ల వారిలో వెలుగు చూసే హృద్రోగ సమస్యలు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం పదమూడేళ్లకే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణ వాసుల్లోనే ఈ సమస్యలు ఎక్కువగా కన్పించేవి. ఫాస్ట్‌ఫుడ్, స్మోకింగ్, ఆల ్కహాల్ కల్చర్ నేడు మారుమూల పల్లెలకూ విస్తరించడంతో వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.