ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస | Dispute Over AP Waqf Board Special Officer Appointment In Vijayawada | Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస

Aug 8 2019 4:00 PM | Updated on Aug 9 2019 2:08 PM

Dispute Over AP Waqf Board Special Officer Appointment In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: జిల్లాలోని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ షేర్వాన్ ఛాంబర్లో బైఠాయించడంతో రసాభాస చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ ఏ అధికారంతో విధులు నిర్వర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాక అతని అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఆధారాలు చూపాలని వీరంగం సృష్టించారు. షేర్వాన్ దీంతో వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డులో జూలై 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డు మెంబర్స్‌తో కూడిన ఫోరమ్ లేని కారణంగా షేర్వాన్ అనే బోర్డు మెంబర్ తన పనిని అడ్డుకుంటున్నారని వివరించారు. హైకోర్టు ప్రొసీడింగ్‌ ప్రకారమే తాను విధులలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నానని, అయితే తన విధులకు షేర్వాన్ ఆటంకం కలిగిస్తున్నాడని ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement