ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో టాపర్స్‌ వీరే.. | JEE Advanced Toppers List 2025 IIT Delhi Zone Student Rajit Gets Top Rank | Sakshi
Sakshi News home page

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో టాపర్స్‌ వీరే..

Jun 2 2025 5:42 PM | Updated on Jun 2 2025 6:35 PM

JEE Advanced Toppers List 2025 IIT Delhi Zone Student Rajit Gets Top Rank

కాన్పూర్‌:  2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు సోమవారం(జూన్ 2వ తేదీ) విడదలయ్యాయి. మే 18వ తేదీన జరిగిన ఈ పరీక్షను ఒక లక్షా ఎనభై వేల నాలుగు వందల ఇరవై రెండు మంది రాయగా, యాభై నాలుగు వేల మూడు వందల డబ్బై ఎనిమిది అర్హత సాధించారు.  ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.  

ఈ ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఓపెన్ కేటగిరిలో కామన్ ర్యాంకు లిస్టులో రజిత్ గుప్తా  332 మార్కునులతో టాపర్ గా నిలిచాడు. మొత్తంగా 360 మార్కులకు జరిగిన ఈ పరీక్షల్లో రజిత్ గుప్తా అత్యధికంగా 332 మార్కులు సాధించాడు.

ఆలిండియా మహిళా టాపర్ గా ఐఐటీ ఖరగ్ పూర్ జోన్ విద్యార్థి దేవదత్ మాజీ నిలిచారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి  వంగాల అజయ్‌రెడ్డి ఈడబ్యూఎస్ విభాగంలో ఆలిండియా టాపర్ గా నిలిచారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి జ్ఞాన రుత్విక్‌ సాయి ఓబీసీ ఎన్‌సీఎల్ విభాగంలో  ఆలిండియా టాపర్‌గా   నిలిచారు.  ఇక కామన్ ర్యాంకు లిస్టులో  ఐఐటీ హైదరాబాద్ జోన్ కు చెందిన ఆర్నవ్  సింగ్, వడ్లమూడి లోకేష్‌లు  టాప్ 10 లో నిలిచారు. ఆర్నవ్ సింగ్ తొమ్మిదో ర్యాంకు, లోకేష్ 10 ర్యాంకు సాధించారు.

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్ 2025 టాప్ 10 ర్యాంకర్లు వీరే(కామన్ ర్యాంక్ లిస్ట్)

  • రజిత్ గుప్తా (ఐఐటీ ఢిల్లీ)

  • సాక్షమ్ జిందాల్‌(ఐఐటీ ఢిల్లీ)

  • మజిద్ ముజాహిద్ హుస్సేన్(ఐఐటీ బొంబే)

  • పర్త్ మందార్ వర్తక్(ఐఐపీ బొంబే)

  • ఉజ్వల్ కేశరి(ఐఐటీ ఢిల్లీ)

  • అక్షత్ కుమార్ చౌరాసియా(ఐఐటీ కాన్పూర్)

  • సాహిల్ ముకేష్ డియో(ఐఐటీ బొంబే)

  • దేవేశ్ పంకజ్ భయా(ఐఐటీ ఢిల్లీ)

  • ఆర్నవ్  సింగ్( ఐఐటీ హైదరాబాద్)

  • వడ్లమూడి లోకేష్( ఐఐటీ హైదరాబాద్)

Advertisement
 
Advertisement
Advertisement