
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శనివారం.. బ్యాంకాక్ నుండి ముంబైకి వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ (A321) విమానం.. ల్యాండింగ్ సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. మళ్లీ గాలిలోకి లేచిన ఆ విమానం ఒక రౌండ్ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ల్యాండింగ్‌ను రద్దు చేశాడు. ఆ విమానం తిరిగి గాలిలోకి లేచే సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. ఆ తర్వాత గాలిలో ఒక రౌండ్ తిరిగిన ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. అవసరమైన తనిఖీలు, మరమ్మతులతో పాటు డీజీసీఏ నుంచి అనుమతి పొందుతామని వెల్లడించింది. ఇండిగోలో కస్టమర్లు, సిబ్బంది భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యతగా ఆ సంస్థ పేర్కొంది.