breaking news
Indigo aircraft
-
Mumbai Airport: రన్‌వేను తాకిన విమానం తోక భాగం
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శనివారం.. బ్యాంకాక్ నుండి ముంబైకి వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ (A321) విమానం.. ల్యాండింగ్ సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. మళ్లీ గాలిలోకి లేచిన ఆ విమానం ఒక రౌండ్ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ల్యాండింగ్‌ను రద్దు చేశాడు. ఆ విమానం తిరిగి గాలిలోకి లేచే సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. ఆ తర్వాత గాలిలో ఒక రౌండ్ తిరిగిన ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. అవసరమైన తనిఖీలు, మరమ్మతులతో పాటు డీజీసీఏ నుంచి అనుమతి పొందుతామని వెల్లడించింది. ఇండిగోలో కస్టమర్లు, సిబ్బంది భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యతగా ఆ సంస్థ పేర్కొంది. -
కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగుళూరు నుండి 52 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టింది. రన్ వేపై అధిక వర్షం పడడంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో సుమారు 50 నిమిషాలు పాటు గాల్లో 10 సార్లు చక్కర్లు కొట్టింది. 50 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీనితో విమానంలో 52 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అదే విమానంలో గన్నవరం విమానాశ్రయం నుండి 57 మంది ప్రయాణికులు బెంగుళూరు వెళ్లేందుకు లాంజ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ విమానం ఉదయం 7.35కి గన్నవరం వచ్చి తిరిగి 8 గంటలకు బెంగుళూరు వెళ్లనుంది. చదవండి: (గులాబ్ తుపాన్ ప్రభావం: పలు రైళ్లు రద్దు) -
విమానాశ్రయాల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌కు బెదిరింపు కాల్ రావటంతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 11 ఇండిగోవిమానాలను పేల్చేస్తామని చెన్నైలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌కు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు స్మిత్ అని, అమెరికా నుంచి కాల్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఇండిగో విమానాలు ఆపరేట్ అవుతున్న పది విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్, వడోదర, గువాహటి, గోవా, కొచ్చి విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలను అత్యవసరంగా ఆపేశారు. విమానాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. -
విమానంలో పొగలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. 154 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మధ్యాహ్నం 3.35 ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఇండిగో ఎయిర్‌బస్ ఏ-320 విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఎడమవైపు కింది భాగం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసి) టవర్ సిబ్బంది దీన్ని గమనించి వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దింపారు. టాక్సీ వేలో ప్రయాణికులను దింపుతున్న సమయంలో 28 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఒకరికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. బుధవారం నాటి ఘటనపై ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు.