HR88B8888 తమకెంతో ఇష్టమైన కార్లకోసం అంతకంటే ఇష్టమైన, నచ్చిన నంబర్లతో నంబర్ ప్లేట్లను దక్కించుకోవడం చాలామంది అలవాటు. వీటినూ వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు అని పిలుచుకుంటారు. అలా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. తాజా వేలంలో ఫలితంగా రికార్డు బద్దలైంది.పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.
హర్యానాలో వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికి ఆన్‌లైన్ వేలం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల మధ్య, బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆపై బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు ప్రకటించే వరకు fancy.parivahan.gov.in పోర్టల్‌లో అధికారిక వేలం జరిగింది.
ఈ వారం, బిడ్డింగ్ కోసం వచ్చిన అన్ని నంబర్లలో, 'HR88B8888' రిజిస్ట్రేషన్ నంబర్ అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను అందుకుంది . మొత్తం 45 అభ్యర్థనలొచ్చాయి. మొత్తానికి అమ్ముడైంది! బేస్ బిడ్డింగ్ ధరను రూ. 50,000గా నిర్ణయించారు. ఇది ప్రతి నిమిషం పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్లకు స్థిరపడింది. బుధవారం హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. ప్రస్తుతం 'HR88B8888' నంబర్ ప్లేట్ అధికారికంగా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్.
చదవండి: ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ఎంతవరకు సేఫ్, ఎలా బుక్ చేసుకోవాలి?
HR అనేది రాష్ట్ర కోడ్, 88 వాహనం నమోదు చేయబడిన హర్యానాలోని నిర్దిష్ట ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లాను సూచిస్తుంది. నిర్దిష్ట RTOలో వాహన సిరీస్ కోడ్‌ను సూచించడానికి B ఉపయోగిస్తారు. 8888 అనేది వాహనానికి కేటాయించిన ప్రత్యేకమైన, నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్.ఈ నంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏమిటంటే, 'B' ని పెద్ద అక్షరంలో పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిది నెంబరు లానే కనిపిస్తుంది ఒకే అంకె 8 పునరావృతమవుతుంది.
ఇప్పటివరకు ఈ రికార్డు కేరళకు చెందిన వ్యక్తి పేరిట ఉంది. ఆయన రూ. 46 లక్షల విలువైన నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఏప్రిల్‌లో, కేరళకు చెందిన టెక్ బిలియనీర్ వేణు గోపాలకృష్ణన్ తన లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మంటే "KL 07 DG 0007" కోసం రూ. 45.99 లక్షల ఖర్చుతో VIP లైసెన్స్ ప్లేట్‌ను కొనుగోలు చేశారు..
ఇవీ చదవండి: మూడు పిట్ బుల్స్ దాడి : కేర్ టేకర్ అమెరికా యువతి దుర్మరణం
ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ఎంతవరకు సేఫ్, ఎలా బుక్ చేసుకోవాలి?


