కోస్ట్‌ గార్డ్‌ డీజీ హఠాన్మరణం | Indian Coast Guard Director General Rakesh Pal died due to Heart Attaks | Sakshi
Sakshi News home page

కోస్ట్‌ గార్డ్‌ డీజీ హఠాన్మరణం

Aug 19 2024 5:49 AM | Updated on Aug 19 2024 5:49 AM

Indian Coast Guard Director General Rakesh Pal died due to Heart Attaks

సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ పాల్‌ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్‌ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్‌ గాంధీ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్‌ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్‌ పాల్‌ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్‌ పాల్‌ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్‌ నావల్‌ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్‌ పాల్‌ 1989లో ఐసీజీ (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement