
భారత వైమానిక దళం నుంచి మిగ్–21 యుద్ధ విమానాలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆ ఫైటర్‌జెట్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.
నడపడం నల్లేరు మీద నడక కాదు
తొలిసారి మన దగ్గరకు వచ్చిన విమానం మిగ్–21, టైప్–74. దానికి అప్పట్లో శిక్షణ విమానాలు లేవు. తొలిసారి ఒంటరిగా విమానాన్ని నడిపే ప్రక్రియ మిగ్–21తోనే మొదలైంది. ఈ విమానానికి సిమ్యులేటర్ లేకపోవడమే కాకుండా, మొత్తం కాక్‌పిట్‌లో ఏదీ ఆంగ్లంలో రాసి లేదు, అంతా రష్యన్ భాషలో ఉండేదని చెప్పారు. ఈ పాత ఎయిర్ వారియర్, వేగం కొలత యూనిట్ కూడా హఠాత్తుగా ‘నాట్స్‘ నుండి ‘కిమీ/గంట‘కి మారిపోయేది. పైలట్లు ‘నాట్స్‘కు అలవాటు పడటంతో.. విమానం నడపడం ఒక సవాలుగా మారేది. ఈ విమానాన్ని తొలిసారి నడిపినపుడు ఎక్కువగా దారి తప్పిపోతారు, తిరిగి వచ్చే వరకు, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియదు.
– ఏవై టిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్, మాజీ భారతీయ వాయుసేనాధిపతి
శవపేటికతో పోలిక సరికాదు
ప్రమాదాలతో ముడిపడిన ఏ విమానాన్ని అయినా ’ఎగిరే శవపేటిక’ వంటి పదాలతో వరి్ణంచడం సరికాదు. అలాంటి పదాలు వాడటం వల్ల, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న పైలట్ల కుటుంబ సభ్యుల మనోధైర్యం దెబ్బతింటుంది,
– పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ పైలట్
నమ్మకమైన సహచరుడు
ఆరు దశాబ్దాలుగా మిగ్–21 భారతీయ వాయుసేనకు వెన్నెముకగా‘ ఉంది. యుద్ధంలో, శాంతి సమయంలో ఒక చిహ్నంగా, నమ్మకమైన సహచరుడిగా, తరతరాల ఫైటర్ పైలట్లకు ఒక పరీక్ష కేంద్రంగా వ్యవహరించింది.
– నితిన్ సాతే, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్
అన్ని సైనిక చర్యల్లోనూ మేటి
1965, 1971 యుద్ధాల్లో అత్యంత అధునాతన ఫైటర్‌గా ఉన్న ఈ విమానం, భారతదేశం చేపట్టిన అన్ని సైనిక చర్యలలో ముందుంది. ఆపరేషన్ సిందూర్‌లో కూడా సత్తా చాటింది, ఇది పాత తరం ఫైటర్ అయినప్పటికీ, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్‌ఫాం విధులు నిర్వహించింది.
– నంద రాజేందర్, స్క్వాడ్రన్ నంబర్ 23 కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెపె్టన్