breaking news
	
		
	
  MiG-21
- 
      
                   
                                                       థాంక్యూ మిగ్భారత వైమానిక దళం నుంచి మిగ్–21 యుద్ధ విమానాలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆ ఫైటర్‌జెట్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.నడపడం నల్లేరు మీద నడక కాదు తొలిసారి మన దగ్గరకు వచ్చిన విమానం మిగ్–21, టైప్–74. దానికి అప్పట్లో శిక్షణ విమానాలు లేవు. తొలిసారి ఒంటరిగా విమానాన్ని నడిపే ప్రక్రియ మిగ్–21తోనే మొదలైంది. ఈ విమానానికి సిమ్యులేటర్ లేకపోవడమే కాకుండా, మొత్తం కాక్‌పిట్‌లో ఏదీ ఆంగ్లంలో రాసి లేదు, అంతా రష్యన్ భాషలో ఉండేదని చెప్పారు. ఈ పాత ఎయిర్ వారియర్, వేగం కొలత యూనిట్ కూడా హఠాత్తుగా ‘నాట్స్‘ నుండి ‘కిమీ/గంట‘కి మారిపోయేది. పైలట్లు ‘నాట్స్‘కు అలవాటు పడటంతో.. విమానం నడపడం ఒక సవాలుగా మారేది. ఈ విమానాన్ని తొలిసారి నడిపినపుడు ఎక్కువగా దారి తప్పిపోతారు, తిరిగి వచ్చే వరకు, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియదు. – ఏవై టిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్, మాజీ భారతీయ వాయుసేనాధిపతిశవపేటికతో పోలిక సరికాదు ప్రమాదాలతో ముడిపడిన ఏ విమానాన్ని అయినా ’ఎగిరే శవపేటిక’ వంటి పదాలతో వరి్ణంచడం సరికాదు. అలాంటి పదాలు వాడటం వల్ల, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న పైలట్ల కుటుంబ సభ్యుల మనోధైర్యం దెబ్బతింటుంది, – పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ పైలట్ నమ్మకమైన సహచరుడు ఆరు దశాబ్దాలుగా మిగ్–21 భారతీయ వాయుసేనకు వెన్నెముకగా‘ ఉంది. యుద్ధంలో, శాంతి సమయంలో ఒక చిహ్నంగా, నమ్మకమైన సహచరుడిగా, తరతరాల ఫైటర్ పైలట్లకు ఒక పరీక్ష కేంద్రంగా వ్యవహరించింది. – నితిన్ సాతే, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ అన్ని సైనిక చర్యల్లోనూ మేటి 1965, 1971 యుద్ధాల్లో అత్యంత అధునాతన ఫైటర్‌గా ఉన్న ఈ విమానం, భారతదేశం చేపట్టిన అన్ని సైనిక చర్యలలో ముందుంది. ఆపరేషన్ సిందూర్‌లో కూడా సత్తా చాటింది, ఇది పాత తరం ఫైటర్ అయినప్పటికీ, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్‌ఫాం విధులు నిర్వహించింది. – నంద రాజేందర్, స్క్వాడ్రన్ నంబర్ 23 కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెపె్టన్
- 
      
                   
                                                       వీర విహంగానికి వందనంచండీగఢ్: మేఘావృతం కాని గగనం నీలిరంగులో మెరిసిపోయింది. ఆరు దశాబ్దాలకు పైగా భారతావనికి కొండంత అండగా నిలిచిన వీర విహంగానికి వీడ్కోలు పలికే వేళ.. ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ విమానం మిగ్–21 సేవల ఉపసంహరణ ఉద్విగ్నభరిత క్షణాల్లో భారత గగన వీధిలో వాతావరణమిది. చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 డీకమిషనింగ్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. భారత వైమానిక దళం యుద్ధ విమానాల బృందానికి వెన్నెముకగా ఉన్న ఈ ఐకానిక్ మిఖోయాన్–గురేవిచ్ మిగ్–21 ఫైటర్ జెట్లు శుక్రవారం చివరిసారిగా భారత గగనతలంలో ఎగిరాయి. దీంతో 62 ఏళ్ల మిగ్–21ల సుదీర్ఘ ప్రస్థానానికి తెర పడింది. కనురెప్పవేయనివ్వని విన్యాసాలు ఒక చారిత్రక అధ్యాయం ముగింపును సూచిస్తూ, లాంఛనప్రాయ ఫ్లైపాస్ట్, డీకమిషనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కైడైవింగ్ బృందం ’ఆకాశ్ గంగ’.. 8,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఆకట్టుకుంది. తరువాత మిగ్–21 విమానం అద్భుతమైన ఫ్లైపాస్ట్, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం కచి్చతత్వంతో కూడిన కవాతు, వైమానిక వందనం కొనసాగాయి. ఫైటర్ పైలట్లు మూడు విమానాల ’బాదల్’ ఫార్మేషన్, నాలుగు విమానాల ’పాంథర్’ ఫార్మేషన్లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోయాయి. ’సూర్య కిరణ్’ ఏరోబాటిక్ బృందం కూడా ఉత్కంఠభరితమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నంబర్ 23 స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్–21 జెట్లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాటికి ’వాటర్ కానన్ సెల్యూట్’ (నీటి ఫిరంగి వందనం) ఇచ్చారు. ’జాగ్వార్’, ’తేజస్’ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వీడ్కోలు కార్యక్రమానికి నెల ముందు, రాజస్థాన్‌లోని బికనేర్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 చివరిసారిగా ఎగిరాయి. ఈ వీడ్కోలుకు గుర్తుగా, ఆగస్టు 18–19న భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నల్ ఎయిర్ బేస్ నుంచి మిగ్–21 సోలో సోర్టీస్ నిర్వహించారు. 1981లో భారతీయ వాయుసేన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్బాగ్ సింగ్, 1963లో ఇక్కడ మొదటి మిగ్–21 స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడం విశేషం.దశాబ్దాలపాటు భారతీయ భద్రతను మోసింది మిగ్–21 కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని.. అది దేశ గౌరవం, భారత్, రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిగ్–21 సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అరవయ్యేళ్లకు పైగా మిగ్–21 సాగించిన ప్రయాణం అసమానమైనదని అభివరి్ణంచారు. ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రత భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలాకోట్ వైమానిక దాడుల నుంచి ఇటీవలి ఆపరేషన్ సిందూర్ వరకు, మిగ్–21 మన సాయుధ దళాలకు అపారమైన శక్తిని అందించిందని వివరించారు. భారతీయ సైనిక విమానయాన ప్రయాణంలో అనేక గరి్వంచదగిన క్షణాలను ఈ విమానం జోడించిందని తెలిపారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రతికూల పరిస్థితుల్లో మిగ్–21 విమానం ఢాకా గవర్నర్ హౌస్‌పై దాడి చేసిన రోజే.. ఆ యుద్ధం ఫలితం స్పష్టమైపోయిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. అదెలాంటి చారిత్రక మిషన్ అయినా.. మిగ్–21 భారతీయ జాతీయ పతాక గౌరవాన్ని ఉన్నతంగా నిలబెట్టిందన్నారు.ఎప్పుడో సేవల ఉపసంహరణ ‘మిగ్–21 గురించి మాట్లాడేటప్పుడు, భారతీయ వాయుసేన 60 ఏళ్ల నాటి విమానాలను నడుపుతోందన్న వ్యాఖ్య లు వింటుంటాం. కానీ 1960, 1970ల లో సాయుధ దళాల్లోకి వచ్చిన మిగ్–21 యుద్ధ విమానాలను చాలా కాలం క్రితమే సేవల నుంచి తొలగించారన్న ముఖ్యమైన వాస్తవాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’.. అని రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. వీడ్కోలు కార్యక్రమంలో భారతీయ వాయుసేన మాజీ చీఫ్‌లు ఏవై టిప్నిస్, ఎస్పీ త్యాగి, బీఎస్ ధనోవా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా సహా మిగ్ విమానాన్ని నడిపిన ఎందరో పైలట్లు పాల్గొన్నారు.
- 
      
                   
                                                       గగన యంత్రడికి ఘనమైన వీడ్కోలుమనుషులకైనా, యంత్రాలకైనా ‘విధుల విరమణ’ వీడ్కోలు ఇవ్వటం అన్నది భావోద్వేగ భరితంగా ఉంటుంది. ఆగస్టు 25న మిగ్–21 యుద్ధ విమానాలకు చివరి టేకాఫ్‌తో లాంఛనంగా వీడ్కోలు పలకటానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒక మిగ్–21ను నడిపారు. ఆ క్షణాలలో అక్కడున్న వారి హృదయాలన్నీ భారమైన కళ్లతో ఆ దృశ్యాన్ని వీక్షించాయి. ‘మిగ్–21’ను కనుక మనిషి అనుకుంటే.. యుద్ధ యోధుడు అనాలి. ఆయుధం అనుకుంటే కనుక... ఆకాశపు ఏకే–47 అనాలి. ఎన్నో యుద్ధాలలో భారత్ వెన్నుదన్నుగా ఉన్న ఈ గర్జించే ‘గన్ను’, కనిపించని టార్గెట్‌ను సైతం ఒక్క చూపుతో భస్మం చేసే ఈ ‘కన్ను’... రూపురేఖలకు విహంగమే కాని, ఇండియన్ ఆర్మీలో సకల బలాల, దళాల ‘అక్షౌహిణి!’ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఆరు దశాబ్దాలకు పైగా దోస్త్ మేరా దోస్త్!!పాం ర్స్... కోబ్రాస్భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ఈ నెల 26న మిగ్–21 యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. దీనర్థం – ఇకపై ఈ ఫైటర్ జెట్లను మన ఆర్మీ ఏ విధమైన విధులకూ ఉపయోగించదు. 62 ఏళ్లుగా సైన్యానికి సేవలు అందిస్తున్న మిగ్–21 లకు స్వస్తి చెప్పటం కోసం భారత ప్రభుత్వం చండీగఢ్‌లో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఐ.ఎ.ఎఫ్‌లో ప్రస్తుతం మిగ్–21 విమానాలకు చెందిన స్క్వాడ్రన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి : ‘పాంథర్స్’ (23వ స్క్వాడ్రన్), రెండు : ‘కోబ్రాస్’ (3వ స్క్వాడ్రన్). రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలో – ‘నల్’ ఎడారి యుద్ధ విమానాల స్థావరం నుంచి ఇవి పని చేస్తుంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాలు, నిర్వహణా సిబ్బంది, వాటిని నడిపే పైలట్లతో కూడిన విభాగాన్ని ‘స్క్వాడ్రన్’ అంటారు. వేరియంట్లలో చివరి మిగ్ఐ.ఎ.ఎఫ్. ఈ ఆరు దశాబ్దాలలో పలు రూపాంతర (వేరియంట్) రకాలైన మిగ్–21లను యుద్ధాలలో ప్రయోగించింది. అవి : మిగ్–21 ఎఫ్, మిగ్–21 పిఎఫ్, మిగ్–21 ఎఫ్.ఎల్, మిగ్–21 ఎం, మిగ్–21 బిస్, మిగ్–21 బైసన్. చివరి వేరియంట్ అయిన ఈ బైసన్ మిగ్లనే ఇప్పుడు మన వైమానిక దళం పక్కన పెట్టబోతున్నది. స్క్వాడ్రన్ 3, స్క్వాడ్రన్ 23లో కలిపి ప్రస్తుతం మొత్తం 36 మిగ్–21 బైసన్లు ఉన్నాయి. అరవై ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ మిగ్–21 యుద్ధ విమానాలలో ఒక దానిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ గత నెలలోనే నడిపి మిగ్‌లకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. (పైన ఫోటోలు). రష్యన్ సంతతికి చెందిన ఈ ఫైటర్ జెట్‌పై శిక్షణ పొందిన పైలట్లు ఆ వీడ్కోలు క్షణాలలో భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి భారత వైమానిక దళం దశల వారీగా మిగ్–21ల వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇది చిట్టచివరి ఉపసంహరణ. ప్రధానంగా భద్రతా సంబంధ కారణాలతో ఐ.ఎ.ఎఫ్. వీటిని నిలిపివేస్తోంది. టెక్నాలజీ పాతపడి పోవటం, ఫైటర్ స్క్వాడ్రన్లను ఆధునికీకరించవలసిన అవసరం ఏర్పడటం వల్ల కూడా మిగ్–21 ల నుంచి భారత్ ఆధునాతన దేశవాళీ ఎల్.సి.ఎ. ఎంకె–1ఎ ఫైటర్ జెట్లకు మళ్లుతోంది. రష్యా నుంచి తొలి మిగ్మిగ్–21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్‌గా కూడా దీనికి రికార్డు ఉంది. భారత్ మొట్టమొదట 1963లో సోవియెట్ యూనియన్ నుండి మిగ్–21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత, రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలు దిగుమతి చేసుకుని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో స్వయంగా మిగ్‌లను తయారు చేసుకోవటం మొదలుపెట్టాం. మిగ్–21లోని వేరియంట్లన్నీ భారత్ వృద్ధి చేసుకున్నవే. అంతేకాదు, ఐ.ఎ.ఎఫ్. దగ్గరున్న మొత్తం 850 మిగ్–21లలో అత్యధికంగా ‘హాల్’ ఉత్పత్తి చేసినవే. 1987 తర్వాత çహాల్లో మిగ్–21ల తయారీ వివిధ కారణాలతో ఆగిపోయింది. రష్యా 1986లోనే పూర్తి స్థాయిలో మిగ్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. మిగ్–21ల ఘన చరిత్ర వియత్నాం యుద్ధం (1955–1975) : ఉత్తర వియత్నాం వైమానిక దళం మిగ్–21 లను విస్తృతంగా ఉపయోగించి అమెరికాపై విజయం సాధించింది. 1966లో అమెరికా డ్రోన్లను కూల్చేసింది! అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణలు: 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో (జూన్ 5 నుంచి 10 వరకు), ఆ తర్వాతా జరిగిన ఘర్షణల్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్... ఇజ్రాయెల్‌పై మిగ్–21లతో తలపడ్డాయి. అయితే ఆరు రోజుల యుద్ధం ప్రారంభంలోనే చాలా వరకు మిగ్‌లు ధ్వంసం అయ్యాయి!ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988):ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఈ ఎనిమిదేళ్ల దీర్ఘ పోరాటంలో పరస్పరం మిగ్–21లను ప్రయోగించుకున్నాయి. సిరియా అంతర్యుద్ధం, లిబియా ఘర్షణలు: సిరియన్ వైమానిక దళం, లిబియా ఘర్షణల్లో లిబియా వైమానిక దళం మిగ్–21లను ఉపయోగించాయి. భారత్–పాక్ యుద్ధాలు 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో మిగ్–21ల పాత్ర పరిమితంగానే ఉంది. గగనతల దాడులేమీ జరగలేదు. 1971లో మిగ్–21 లు భారత్‌కు గగనతల పోరాటంలో ఆధిక్యతను చేకూర్చాయి. పాక్ విమానాలను కూల్చేశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తా¯Œ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను సైతం విస్మయపరచింది. డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై భారత్ మిగ్–21 బాంబులతో దాడిచేసింది. ఆ మర్నాడే గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాతి రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు.1999 కార్గిల్ వార్‌లో ఎత్తయిన ప్రదేశాల నుండి ఉపరితల దాడులకు భారత్ మిగ్–21 లను సంధించింది. వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం కూడా వీటిని ఉపయోగిం చింది. ఆపరేష¯Œ సఫేద్ సాగర్‌లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019లో పాక్‌తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్‌పై భారత్ జరిపిన భారీ దాడిలో మిగ్–21లు కీలక పాత్ర పోషించాయి. అత్యంత శక్తిమంతమైన ఎఫ్–16ను సైతం నేల కూల్చాయి. మిగ్కు ఆ పేరెలా వచ్చింది?మాస్కోలో 1939లో ప్రారంభమైన ‘మికోయన్’ ఏరోస్పేస్ కంపెనీ సంస్థాపకుల పేర్ల నుండి మిగ్–21 అనే మాట వచ్చింది. ఇందులో 21 అనేది మిగ్ విమానం మోడల్ నెంబరు. ‘మికోయన్’ సంస్థ.. ఆర్టెమ్ మికోయన్, మిఖాయిల్ గురేవిచ్ అనే ఇద్దరు ఏరో డిజైనర్ల ఆలోచన నుంచి ఆవిర్భవించింది. అన్నీ ఇన్నీ కాని ప్రత్యేకతలు!మిగ్‌లు తేలికపాటి, సూపర్సోనిక్ ఫైటర్ జెట్లు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుండి భూతలంలోకి ఇవి సులువుగా మెరుపు దాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కొన్ని సాంకేతికతలైతే అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా నేరుగా దాడి చేయగల రాడార్ వ్యవస్థ మిగ్‌లలో ఉంది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా మిగ్–21 విమానాలు పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దొంగిలించింది!భారత వైమానిక దళానికి చేరిన తొలి సోపర్సోనిక్ ఫైటర్ జెట్లు మిగ్–21 లు. 1960–70 ల మధ్య భారత్‌కు గగనతల యుద్ధంలో ఇవి శక్తిమంతమైన అదనపు బలగాలు అయ్యాయి. పశ్చిమ దేశాలకు పక్కలో బల్లెంలా మారాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మిగ్–21ల టెక్నాలజీని దొంగిలించిందని కూడా అంటారు! ఒకసారి వీటిని నడిపిన పైలట్లు మరే విమానాన్నీ నడపటానికి ఆసక్తి చూపరనే మాటా వినిపిస్తుంటుంది. గాలిలో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం మిగ్లలోని మరికొన్ని ప్రత్యేకతలు. సాధారణ యుద్ధ విమానాలు ‘ఫ్లయ్–బై–వైర్’ అనే సిస్టమ్‌తో వేగాన్ని నియంత్రించుకుంటాయి. మిగ్‌లు గేర్ సిస్టమ్‌తో పని చేస్తాయి. దాంతో గంటకు 2000 కి.మీ. వేగాన్ని కూడా ఇవి అందుకోగలవు! అంత వేగంలో పైలట్ పట్టు కోల్పోవటమే తరచు జరిగే మిగ్‌ల ప్రమాదాలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. ‘ఎగిరే శవపేటికలు’!మొదట్లో గగన సింహాలై గర్జించి, విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన మిగ్–21 లు తర్వాత్తర్వాత తరచు ప్రమాదాలకు గురవుతూ పైలట్లు, పౌరులు మరణిస్తుండటంతో ‘ఎగిరే శవపేటిక’లు అనే అప్రతిష్ఠను, అపకీర్తిని మోయవలసి వచ్చింది. కాలం చెల్లిన మిగ్‌లను ఇంకా ఎన్నేళ్లు ఉపయోగిస్తాం అనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 విమానాలు పలు ప్రమాదాల్లో నేలకూలాయని 2012లోనే ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు కూడా. ఆనాటి లెక్కల ప్రకారమే చూసుకున్నా... 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మరణించారు. పైగా భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. యాదృచ్ఛికంగా – 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో తుది వీడ్కోలు పలకనున్నారు. మిగ్‌ల స్థానంలో ‘ఎంకె–1ఎ’లుభారత వాయు సేన 1963 నుండి మిగ్–21లను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి స్థానంలోకి, దేశీయంగా తయారౌతున్న ఎల్.సి.ఎ. తేజస్ ఎంకె–1ఎ విమానాలను వినియోగంలోకి తేబోతోంది. ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్.ఎ.ఎల్.) ఈ ఎంకె–1ఎ లను ఉత్పత్తి చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.తో ఇప్పటికే 83 ఎంకె–1ఎ ల కోనుగోలు కోసం ఆర్డర్ పెట్టిన ప్రభుత్వం, భారత వాయుసేన ను మరింత బలోపేతం చేయటానికి ఇటీవలే మరో 93 ఎంకె–1ఎల కోసం రూ.66,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల క్రితం తొలి విడతగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన 83 విమానాల డెలివరీ కూడా మొదలు కావలసి ఉంది.
- 
      
                   
                                 ‘‘ఈ ఎగిరే శవ పేటికలను రద్దు చేయండి’’న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో మిగ్ ఫైటర్ జెట్లది ప్రత్యేక స్థానం. రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌లో వీటినే వాడారు. వైమానిక దళంలో వీటి ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫైటర్ జెట్లు ప్రతి ఏటా పలువురు యువ ఐఏఎఫ్ ట్రైనీలను బలి తీసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫైటర్ జెట్లు చాలా పురాతనమైనవి కావడంతో.. ట్రైనింగ్ సమయంలో కూలి పోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మిగ్-21 ఫైటర్ జెట్ పంజాబ్ మోగా జిల్లాలో కూలిపోయింది. ప్రమాద సమయంలో దానిలో ఉన్న పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మరణించారు. ఈ క్రమంలో ఆయన తండ్రి ‘‘ఈ ప్రమాదంలో నేను నా కుమారుడిని పొగొట్టుకున్నాను. మరి కొందరు తల్లిదండ్రులకు ఈ గర్భశోకం తప్పాలంటే.. దయచేసి ఈ మిగ్ ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ నుంచి తొలగించండి’’ అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో గురువారం అర్ధరాత్రి తర్వాత మిగ్-21 బైసన్ యుద్ధ విమాన కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రోన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించాడు. ఈ వార్త తలెసిన వెంటనే సన్నిహితులు, బంధువులు మీరట్‌లోని అతడి ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అభినవ్ చౌదరి తండ్రి మిగ్-21 ఫైటర్ జెట్లను తొలగించాల్సిందిగా కన్నీటితో వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభినవ్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘1980లోనే రష్యా వీటిని రద్దు చేసింది. ప్రతి ఏటా కుప్ప కూలుతున్న ఈ ఎగిరే శవ పేటికలు అనేక మంది యువకుల కలలను, జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ పాత కాలపు యుద్ధ విమానాలను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఫైటర్ పైలెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తుంది. అలాంటప్పుడు ఈ అరిగిపోయిన విమానాలను శిక్షణ కోసం ఎందుకు అనుమతిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. చదవండి: ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణం
- 
      
                   
                                 ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణంచండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి దాటాక పంజాబ్ రాష్ట్రంలోని మోగా వద్ద విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మృతిచెందినట్లు ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్లో ప్రకటించింది. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో వెస్ట్రన్ సెక్టార్లో లాంగియానా ఖుర్ద్ గ్రామంలో మిగ్ బైసన్ విమానం కూలిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం అధికారులు చెప్పారు. కాగా, అభినవ్ కుటుంబానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంతాపం తెలిపింది. మూడోది ఈ ఏడాది మిగ్ యుద్ధ విమానాల ప్రమాదాల్లో ఇది మూడవది. జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్ ఘడ్ వద్ద విమానం కూలిపోగా, పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. మార్చి నెలలో ఎయిర్ బేస్ వద్ద మిగ్ బైసన్ విమాన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా చనిపోయారు. ట్రైనింగ్ కోసం విమానం బయలుదేరినపుడు ఈ ప్రమాదం జరగ్గా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
- 
      
                   
                                 గగనతలంలో అరుదైన ఘట్టంన్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్‌తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్ మార్షల్‌గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్‌తో కలిసి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్‌తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
- 
      
                   
                                 జెట్ ఇంధన ట్యాంకులను వదిలిన పైలట్లుజైపూర్ : ఆకాశం నుంచి జెట్ విమాన ఇంధన ట్యాంకులు పడటంతో జైపూర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంధన ట్యాంకులను భారతీయ వాయుసేనకు అందజేశారు. దీనిపై మాట్లాడిన పోలీసులు.. జెట్‌ను పరీక్షిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్తగా పైలట్లు ఇంధన ట్యాంకులను జార విడిచారని చెప్పారు. అనంతరం జెట్‌ను సన్గనేర్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వివరించారు. గ్రామ సరిహద్దులోని కొండ ప్రాంతంలో ఇంధన ట్యాంకులు పడ్డాయని వివరించారు. కాగా, ఇంధన ట్యాంకులు కింద పడిన సమయంలో పేలుడు సంభవించడంతో.. ఏదో జరిగిపోతోందని భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు వెల్లడించారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన మిగ్ -21కు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
- 
      
                    గుజరాత్లో కూలిన ‘మిగ్-21’
 జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా, బేద్ గ్రామం వద్ద శనివారం వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలికి సమీపంలో సముద్రతీరంలో దిగిన పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఆయనను వాయుసేన సిబ్బంది వెంటనే హెలికాప్టర్లో వచ్చి తరలించారని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, 2012లో రెండు వాయుసేన హెలికాప్టర్లు ఢీకొన్న ఘటన కూడా ఇదే ప్రాంతంలో జరగగా, ఆ సంఘటనలో 9 మంది మరణించారు. గత మంగళవారం రాజస్థాన్‌లో ఓ మిగ్-27 విమానం కూలింది.
- 
      
                    కాశ్మీర్ లో కూలిన మిగ్-21, పైలట్ దుర్మరణం
 భారత వైమానిక దళంలో మృత్యు విహంగంగా పేరొందిన మిగ్-21 మరో పైలట్ ప్రాణాలను బలిగొంది. జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. దాంత పైలట్ అక్కడికక్కడే మరణించాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా వెళ్లిన ఈ విమానం పొలాల్లో కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
 
 విమాన పైలట్ రఘు వంశీ ఈ ప్రమాదంలో మరణించారు. మంగళవారం ఉదయం టెక్నికల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఉదయమే ఈ మిగ్-21 విమానం టేకాఫ్ తీసుకుంది. అది ఎందుకు కూలిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.


