breaking news
Retair
-
థాంక్యూ మిగ్
భారత వైమానిక దళం నుంచి మిగ్–21 యుద్ధ విమానాలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆ ఫైటర్‌జెట్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.నడపడం నల్లేరు మీద నడక కాదు తొలిసారి మన దగ్గరకు వచ్చిన విమానం మిగ్–21, టైప్–74. దానికి అప్పట్లో శిక్షణ విమానాలు లేవు. తొలిసారి ఒంటరిగా విమానాన్ని నడిపే ప్రక్రియ మిగ్–21తోనే మొదలైంది. ఈ విమానానికి సిమ్యులేటర్ లేకపోవడమే కాకుండా, మొత్తం కాక్‌పిట్‌లో ఏదీ ఆంగ్లంలో రాసి లేదు, అంతా రష్యన్ భాషలో ఉండేదని చెప్పారు. ఈ పాత ఎయిర్ వారియర్, వేగం కొలత యూనిట్ కూడా హఠాత్తుగా ‘నాట్స్‘ నుండి ‘కిమీ/గంట‘కి మారిపోయేది. పైలట్లు ‘నాట్స్‘కు అలవాటు పడటంతో.. విమానం నడపడం ఒక సవాలుగా మారేది. ఈ విమానాన్ని తొలిసారి నడిపినపుడు ఎక్కువగా దారి తప్పిపోతారు, తిరిగి వచ్చే వరకు, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియదు. – ఏవై టిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్, మాజీ భారతీయ వాయుసేనాధిపతిశవపేటికతో పోలిక సరికాదు ప్రమాదాలతో ముడిపడిన ఏ విమానాన్ని అయినా ’ఎగిరే శవపేటిక’ వంటి పదాలతో వరి్ణంచడం సరికాదు. అలాంటి పదాలు వాడటం వల్ల, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న పైలట్ల కుటుంబ సభ్యుల మనోధైర్యం దెబ్బతింటుంది, – పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ పైలట్ నమ్మకమైన సహచరుడు ఆరు దశాబ్దాలుగా మిగ్–21 భారతీయ వాయుసేనకు వెన్నెముకగా‘ ఉంది. యుద్ధంలో, శాంతి సమయంలో ఒక చిహ్నంగా, నమ్మకమైన సహచరుడిగా, తరతరాల ఫైటర్ పైలట్లకు ఒక పరీక్ష కేంద్రంగా వ్యవహరించింది. – నితిన్ సాతే, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ అన్ని సైనిక చర్యల్లోనూ మేటి 1965, 1971 యుద్ధాల్లో అత్యంత అధునాతన ఫైటర్‌గా ఉన్న ఈ విమానం, భారతదేశం చేపట్టిన అన్ని సైనిక చర్యలలో ముందుంది. ఆపరేషన్ సిందూర్‌లో కూడా సత్తా చాటింది, ఇది పాత తరం ఫైటర్ అయినప్పటికీ, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్‌ఫాం విధులు నిర్వహించింది. – నంద రాజేందర్, స్క్వాడ్రన్ నంబర్ 23 కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెపె్టన్ -
వీర విహంగానికి వందనం
చండీగఢ్: మేఘావృతం కాని గగనం నీలిరంగులో మెరిసిపోయింది. ఆరు దశాబ్దాలకు పైగా భారతావనికి కొండంత అండగా నిలిచిన వీర విహంగానికి వీడ్కోలు పలికే వేళ.. ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ విమానం మిగ్–21 సేవల ఉపసంహరణ ఉద్విగ్నభరిత క్షణాల్లో భారత గగన వీధిలో వాతావరణమిది. చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 డీకమిషనింగ్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. భారత వైమానిక దళం యుద్ధ విమానాల బృందానికి వెన్నెముకగా ఉన్న ఈ ఐకానిక్ మిఖోయాన్–గురేవిచ్ మిగ్–21 ఫైటర్ జెట్లు శుక్రవారం చివరిసారిగా భారత గగనతలంలో ఎగిరాయి. దీంతో 62 ఏళ్ల మిగ్–21ల సుదీర్ఘ ప్రస్థానానికి తెర పడింది. కనురెప్పవేయనివ్వని విన్యాసాలు ఒక చారిత్రక అధ్యాయం ముగింపును సూచిస్తూ, లాంఛనప్రాయ ఫ్లైపాస్ట్, డీకమిషనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కైడైవింగ్ బృందం ’ఆకాశ్ గంగ’.. 8,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఆకట్టుకుంది. తరువాత మిగ్–21 విమానం అద్భుతమైన ఫ్లైపాస్ట్, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం కచి్చతత్వంతో కూడిన కవాతు, వైమానిక వందనం కొనసాగాయి. ఫైటర్ పైలట్లు మూడు విమానాల ’బాదల్’ ఫార్మేషన్, నాలుగు విమానాల ’పాంథర్’ ఫార్మేషన్లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోయాయి. ’సూర్య కిరణ్’ ఏరోబాటిక్ బృందం కూడా ఉత్కంఠభరితమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నంబర్ 23 స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్–21 జెట్లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాటికి ’వాటర్ కానన్ సెల్యూట్’ (నీటి ఫిరంగి వందనం) ఇచ్చారు. ’జాగ్వార్’, ’తేజస్’ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వీడ్కోలు కార్యక్రమానికి నెల ముందు, రాజస్థాన్‌లోని బికనేర్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 చివరిసారిగా ఎగిరాయి. ఈ వీడ్కోలుకు గుర్తుగా, ఆగస్టు 18–19న భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నల్ ఎయిర్ బేస్ నుంచి మిగ్–21 సోలో సోర్టీస్ నిర్వహించారు. 1981లో భారతీయ వాయుసేన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్బాగ్ సింగ్, 1963లో ఇక్కడ మొదటి మిగ్–21 స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడం విశేషం.దశాబ్దాలపాటు భారతీయ భద్రతను మోసింది మిగ్–21 కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని.. అది దేశ గౌరవం, భారత్, రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిగ్–21 సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అరవయ్యేళ్లకు పైగా మిగ్–21 సాగించిన ప్రయాణం అసమానమైనదని అభివరి్ణంచారు. ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రత భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలాకోట్ వైమానిక దాడుల నుంచి ఇటీవలి ఆపరేషన్ సిందూర్ వరకు, మిగ్–21 మన సాయుధ దళాలకు అపారమైన శక్తిని అందించిందని వివరించారు. భారతీయ సైనిక విమానయాన ప్రయాణంలో అనేక గరి్వంచదగిన క్షణాలను ఈ విమానం జోడించిందని తెలిపారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రతికూల పరిస్థితుల్లో మిగ్–21 విమానం ఢాకా గవర్నర్ హౌస్‌పై దాడి చేసిన రోజే.. ఆ యుద్ధం ఫలితం స్పష్టమైపోయిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. అదెలాంటి చారిత్రక మిషన్ అయినా.. మిగ్–21 భారతీయ జాతీయ పతాక గౌరవాన్ని ఉన్నతంగా నిలబెట్టిందన్నారు.ఎప్పుడో సేవల ఉపసంహరణ ‘మిగ్–21 గురించి మాట్లాడేటప్పుడు, భారతీయ వాయుసేన 60 ఏళ్ల నాటి విమానాలను నడుపుతోందన్న వ్యాఖ్య లు వింటుంటాం. కానీ 1960, 1970ల లో సాయుధ దళాల్లోకి వచ్చిన మిగ్–21 యుద్ధ విమానాలను చాలా కాలం క్రితమే సేవల నుంచి తొలగించారన్న ముఖ్యమైన వాస్తవాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’.. అని రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. వీడ్కోలు కార్యక్రమంలో భారతీయ వాయుసేన మాజీ చీఫ్‌లు ఏవై టిప్నిస్, ఎస్పీ త్యాగి, బీఎస్ ధనోవా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా సహా మిగ్ విమానాన్ని నడిపిన ఎందరో పైలట్లు పాల్గొన్నారు. -
కీళ్లనొప్పులు.. ఆటకు గుడ్‌బై చెబుతా: సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
ఐఏఎస్ వదిలి సీఎం అయ్యిందెవరు? ఎంపీలో ఏం జరుగుతోంది?
మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బ్యూరోక్రాట్లు(పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారులు) రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ రాజీనామా ఆమోదం పొందింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన నిషా బాంగ్రే రాజీనామా ఆమోదం పెండింగ్‌లో ఉంది. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రానని రాజీవ్ చెప్పగా, నిషా మాత్రం రాజకీయ రంగంలోకి దూకేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన కొందరు అధికారులు రెండు నెలల క్రితమే బీజేపీలో చేరగా, మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు క్యూలో ఉన్నారు. కాగా ఒక ఉన్నతాధికారి రాజకీయాల్లో విజయవంతమయ్యారనే దానికి ఉదాహరణ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ఈయన ఐఏఎస్ సర్వీస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. తరువాతి కాలంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు తమ పదవులను వదిలి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అజాతశత్రు: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. అజితా వాజ్‌పేయి పాండే: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. జీఎస్ దామోర్: నీటి వనరులశాఖలో ఇంజనీర్ అయిన ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి, రత్లాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హీరాలాల్ త్రివేది: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ‘స్పాక్స్’ పార్టీని స్థాపించారు. రుస్తమ్ సింగ్: ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేశాక బీజేపీలోకి వచ్చారు. మంత్రిగా కూడా అయ్యారు. ఎస్ ఎస్ ఉప్పల్ : ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. వరదమూర్తి మిశ్రా: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి, ప్రత్యేక పార్టీని స్థాపించారు. వీణా ఘనేకర్: ఐఏఎస్ నుండి పదవీ విరమణ తర్వాత స్పాక్స్లో చేరారు. వీకే బాతం: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. ఉన్నతాధికారులు రాజకీయాల్లో ప్రవేశించడం వెనుక ఒక కారణమందని విశ్లేషకులు అంటున్నారు. వీరు ఎమ్మెల్యేలను, మంత్రులను దగ్గరి నుంచి చూడటం వలన వారి హోదాకు ప్రభావితమవుతుంటారు. దీంతో రాజకీయాల్లో తాము కూడా రాణించగలమన్న భావన వారిలో కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే వారు రాజకీయ నాయకులు, పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా చదవండి: నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం! -
ఆటకు శామ్యూల్స్ టాటా
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనతోనే విండీస్ రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు కూడా లభించాయి. శామ్యూల్స్ కెరీర్లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో శామ్యూల్స్ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు. -
9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ నెల 8 సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు, ప్రభాత్ ఖబర్ హిందీ పత్రిక ఎడిటర్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల తేదీల్ని వెంకయ్య ప్రకటించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రాంగణంలోని కాంగ్రెస్ నేత ఆజాద్ చాంబర్లో భేటీఅయ్యాయి. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలన్న అంశంపై చర్చించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సభలో బలాబలాలెంత: ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
ఆ సేవలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే
రైల్వేలో తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలంపై హైకోర్టు 13 ఏళ్ల నాటి ప్రశ్నకు విస్తృత ధర్మాసనం సమాధానం పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం కాదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘భారతీయ రైల్వేల్లో రోజువారీ వేతనంపై ఓ క్యాజువల్ లేబర్ పని చేసేవాడు. తర్వాత తాత్కాలిక ఉద్యోగిగా నియమితుడయ్యాడు. అనంతరం రెగ్యులర్ ఉద్యోగి అయ్యాడు. ఆ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలను లెక్కించేటప్పుడు అతను తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలాన్ని, క్యాజువల్ లేబర్‌గా సేవలందించిన కాలంలో 50 శాతం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా?’ అనే 2002 నాటి ప్రశ్నకు హైకోర్టు విస్తృత ధర్మాసనం సమాధానం ఇచ్చింది. ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తాత్కాలిక, రెగ్యులర్ ఉద్యోగిగా ఎలాంటి అంతరాయం లేకుండా ఆ వ్యక్తి సేవలు అందించి ఉంటే ఆ ఉద్యోగి తాత్కాలిక ఉద్యోగ కాలం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే, న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 18న తీర్పునిచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్ నవీన్‌రావు తీర్పు రాశారు. రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా చూడాలి.. ‘రైల్వేబోర్డు రూల్ 20 ప్రకారం ఓ ఉద్యోగి సర్వీసును అతను మొదట ఏ పోస్టులో చేరారో అప్పటి నుంచి లెక్కించాలి. అది తాత్కాలిక ఉద్యోగమైనా సరే. అయితే ఆ ఉద్యోగాన్ని నిరాటంకంగా చేసి ఉండాలి. ఈ విషయంలో తాత్కాలిక ఉద్యోగిని కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చూడాలి. కాబట్టి పదవీ విరమణ ప్రయోజనాలు లెక్కించేటప్పుడు అతను పనిచేసిన కాలంలో 50 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంత మాత్రం అర్థం లేని పని.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి కావు.. ‘ఓ నిబంధన ఎక్కువ మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుంటే, ఆ నిబంధన పట్ల ఉదారతతో వ్యవహరించి ఆ మేర భాష్యం చెప్పాల్సి ఉంటుంది. పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి ఎంత మాత్రం కావు. ఓ ఉద్యోగి ఎంతో కష్టపడి, నిబద్ధతతో అందించిన సేవలకు గాను నగదు రూపంలో ఇచ్చే గుర్తింపు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.