భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది: యూపీ సీఎం | Sakshi
Sakshi News home page

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది: యూపీ సీఎం

Published Sun, Mar 10 2024 9:46 PM

India Will Become Worlds Third Largest Economy During PM Modi Third Term - Sakshi

ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' మళ్ళీ అధికారంలోకి వస్తే.. భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో నారీ శక్తి వందన్‌ కార్యక్రమంలో ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే.. దేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతుంది. ప్రజల జీవితాల్లో సుసంపన్నత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూ.679 కోట్లతో చేపట్టిన 673 అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

మరోసారి మోదీ సర్కార్ వస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 వందలకు పైగా సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

మన పూర్వీకులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించిన అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి. కానీ మహా మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి 'రామ్ లల్లా' ప్రతిష్టాపన కల కూడా మోదీ వల్ల సాధ్యమైందని ఆదిత్యనాథ్ అన్నారు.

ఒకప్పుడు దేశంలో షుగర్ బౌల్‌గా పేరుగాంచిన దేవరియా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నష్టపోయింది. దీంతో డియోరియా, ఖుషీనగర్‌లు వెనుకబడిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాలలో పేదరికం మరింత పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం (బీజేపీ) అధికారంలోకి వచ్చిన తరువాత చక్కర కర్మాగారాల పునరుద్ధరణ జరిగిందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

డియోరియాలో పేద కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేసినట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు, అప్రూవల్ లెటర్స్, ఆయుష్మాన్ కార్డులు, స్మార్ట్‌ఫోన్‌లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.

Advertisement
Advertisement