ఒక్క రోజులో 35,871 కేసులు | India records 35,871 new COVID-19 cases | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో 35,871 కేసులు

Mar 19 2021 5:48 AM | Updated on Mar 19 2021 5:48 AM

India records 35,871 new COVID-19 cases - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 35,871 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల్లో ఈ స్థాయిలో కేసులు రికార్డవ్వడం ఇదే మొదటిసారి. గత ఏడాది డిసెంబర్‌ 6న 36,011 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,14,74,605కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 172 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 1,59,216కు చేరింది.

మహారాష్ట్రలో కరోనా ఉధృతి
కరోనా భూతం మహారాష్ట్రను వణికిస్తోంది. ఒక్క రోజులోనే 25,833 పాజిటివ్‌ కేసులు బయపడ్డాయి. రాష్ట్రంలో 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,96,340కు చేరింది. ఇప్పటిదాకా కరోనా కారణంగా 53,138 మంది మృతిచెందారు. నాగ్‌పూర్, పుణే, ముంబై తదితర ప్రధాన నగరాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement