సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ

India development story has become a matter of discussion around the world - Sakshi

మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్‌ టాప్‌కార్‌లో రోడ్‌ షో చేశారు. తర్వాత మాట్లాడారు.

సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్‌ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్‌గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top