India Completes 1 Year of Covid-19 Vaccination Drive - Sakshi
Sakshi News home page

24 గంటల్లో స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటు.. కొత్తగా 2.71 లక్షల కేసులు

Jan 16 2022 10:29 AM | Updated on Jan 16 2022 11:53 AM

India Corona Cases Update Vaccination Drive Complete One Year - Sakshi

పండుగ పూట స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటుతో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా  2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు.


శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య  15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్‌ కేసుల సంఖ్య  7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్‌ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 66 లక్షల డోసుల‍్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న పది వేల కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. 

వ్యాక్సినేషన్‌కి ఏడాది పూర్తి

#1YearOfVaccineDrive.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement