చల్లబడ్డ ఢిల్లీ.. భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం

Heavy Rain In Delhi Affects Flights - Sakshi

ఢిల్లీ:  భానుడి ప్రతాపంతో ఉడికిపోయిన ఢిల్లీ.. ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది.  శనివారం వేకువఝాము నుంచే కురిసిన భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలులకు పలుప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విమాన రాకపోకలపైనా ఇది ప్రభావం చూపెట్టింది. 

నోయిడా, ఘజియాబాద్‌తోపాటు దేశ రాజధాని రీజియన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.  మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

వాతావరణంలోని మార్పుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, సరైన సమాచారం కోసం తమను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ  ఒక ప్రకటనలో పేర్కొంది. 

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల్ని చవిచూసింది ఢిల్లీ. ఈ సీజన్‌లో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో నగరవాసులు అల్లలాడిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top