కన్నుల పండువగా... | 79th Independence Day highlights | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా...

Aug 16 2025 6:06 AM | Updated on Aug 16 2025 6:06 AM

79th Independence Day highlights

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలు సాకారం చేయడానికి, ‘అభివృద్ధి చెందిన భారత్‌’నిర్మాణానికి పౌరులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.  

→ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు కావడానికంటే ముందు ప్రధాని మోదీ తొలుత రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాం«దీకి ఘనంగా నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు.  

→ పంద్రాగస్టు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మోదీ ఈసారి కాషాయ రంగు తలపాగా ధరించారు. తెల్లరంగు కుర్తా, కాషాయ రంగు బంద్‌గలా జాకెట్‌ ధరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన గత 12 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేర్వేరు రంగులు తలపాగాలు ధరిస్తున్నారు.  

→ స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాల విషయంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును మోదీ తిరగరాశారు. మోదీ వరుసగా 12 ఏళ్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఈ విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాతి స్థానం మోదీదే కావడం విశేషం. నెహ్రూ ఎర్రకోట నుంచి వరుసగా 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో మొత్తం 16 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించగా, ఇందులో వరుసగా ప్రతిఏటా చేసిన ప్రసంగాలు 11 మాత్రమే.  
→ ఈసారి వేడుకలకు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రజలకు విశిష్టమైన సేవలు అందించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సర్పంచ్‌లు, లఖ్‌పదీ దీదీలతోపాటు వినూత్న సాగు పద్ధతులతో గుర్తింపు పొందిన రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా నిలిచివారికి కూడా ఆహా్వనం పలికింది. త్వరలో స్పెషల్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నబోతున్న భారత క్రీడాకారులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సేవలందించిన వాలంటీర్లు, పారిశుధ్య 
కారి్మకులు సైతం హాజరయ్యారు.  

→ వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,500 మంది తమ సంప్రదాయ వ్రస్తాలు ధరించి రావడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.  

→ ప్రధానమంత్రి ప్రసంగం ఏకంగా 103 నిమిషాల పాటు సాగింది.  

→ మోదీ తన ప్రసంగంలో పలు కవితలను ప్రస్తావించారు. ‘సమృద్ధ భారత్‌’కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ కష్టపడి పనిచేసేవారే చరిత్ర సృష్టిస్తారని కవిత రూపంలో చెప్పారు. ఉక్కు లాంటి రాళ్లను ముక్కలు చేసే సత్తా కలిగినవారికి కాలం కూడా సహకరిస్తుందని అన్నారు. కాలాన్ని మనకు అనువుగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు.  

→ రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ ఈసారి ఎర్రకోట వద్ద వేడుకులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement