అరుదైన ఘట్టం!..జీవిత కాలంలో చూస్తానని ఊహించలేదు: దేవెగౌడ

HD Devegowda Attends Parliament Inauguration Said Didnt Expect This - Sakshi

న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(91) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత కాలంలో ఈ కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వేడుకను చూస్తానని గానీ అందులోకి అడుగుపెట్టి కూర్చొంటానని గానీ ఊహించ లేదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని, దాన్ని చూడటం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు.

తాను 1962లో కర్ణాట శాసనసభలో అడుగుపెట్టానని, 1961 నుంచి పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నాని చెప్పారు. 32 ఏళ్ల క్రితం ఈ గొప్ప ప్రజల సభలోకి అగడుపెట్టానన్నారు. ఐతే తాను ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, ప్రజా జీవితంలో ఇంతకాలం కొనసాగుతానని కూడా ఊహించలేదన్నారు. అన్నింటికంటే అ‍త్యంత ఆశ్చర్యకరమైన విషయం.. కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం, కూర్చొవడమే అన్నారు. 91 ఏళ్ల వయసులో ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. పాత పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించినప్పుడూ భారతదేశం ఇంకా వలసపాలనలోనే ఉందని, పూర్తి స్వేచ్ఛ రాలేదని పేర్కొన్నారు.

నాటి జాతిపిత, ప్రముఖ జాతీయ వ్యక్తులను స్మరించుకుంటూ..మన దేశ పార్లమెంట్‌పై రక్తంతో తడిసిన కళంకం లేదన్నారు. తాము శాంతియుతంగా, అహింసా మార్గాల ద్వారా దేశానికి బానిస విముక్తి కలిగించి స్వతంత్యాన్ని సమపార్జించామని చెప్పారు. ఇది అత్యంత అమూల్యమైన విజయం అని, విలువలతో కూడిన వ్యవస్థను కాపాడు కోవడమే గాక మన భావితరాలకు అందించాలన్నారు. "అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంట్‌ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అది పలువురు నాయకుల అహంకారం, వినయం, గెలుపోటములు చూసింది. మొత్తంగా అది సమతుల్యతను కాపాడుకుంటూ.. భారతదేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నించింది.

ఈ పార్లమెంట్‌ అన్ని కులాలు, జాతులు, మతాలు, భాషలు తోసహ అన్ని భౌగోళికాలను పోషించింది. ఇది అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. ఇలా భారతదేశ వైవిధ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు. ఈ కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సెల్యూట్‌ చేస్తున్నా. మన సుసంపన్నమైన ‍ప్రజాస్వామ్య సంప్రదాయం కొనసాగాలని, కాలం గడిచే కొద్ది అభివృద్ధి చెందుతూ ప్రకాశవంతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా" అని అన్నారు దేవెగౌడ. 

(చదవండి: 'సెంగోల్‌' ఒరిగిపోయింది!: స్టాలిన్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top