
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్‌పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్‌లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.
GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.
pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025
ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్‌లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.