రక్షణ కార్యదర్శిగా రాజేష్‌ సింగ్‌ | Government appoints RK Singh as new defence secretary | Sakshi
Sakshi News home page

రక్షణ కార్యదర్శిగా రాజేష్‌ సింగ్‌

Aug 17 2024 6:32 AM | Updated on Aug 17 2024 6:32 AM

Government appoints RK Singh as new defence secretary

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్‌ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్‌ సింగ్‌ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్‌ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్‌ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. 

అప్పుడు గిరిధర్‌ స్థానంలో రాజేష్‌‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్‌.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్‌ బ్యూరోకాట్‌ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement