
‘‘స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ఏదో ఒక వీడియో క్రేజీగా చేసేద్దాం. వీలైతే వైరల్ అయిపోదాం’’ అనే ఆలోచనకు వయసు నిమిత్తం లేకుండా పోతోంది. చిన్నపిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలిదాకా.. ఏదో ఒక వీడియోతో ఓవర్‌నైట్‌లో ఫేమ్ అయిపోవడం(ఆ ఒక్క వీడియోతోనే) చూస్తున్నాం కూడా. అలా.. ఇక్కడ ఓ అమ్మాయి అనుకుంది. కానీ, ఆ ఆలోచన బెడిసి కొట్టింది.
జోరుగా వాన పడుతోంది. ఆ వానలో ఓ అమ్మాయి సరదాగా రీల్ చేయాలని అనుకుంది. అయితే కారెక్కి కూర్చుని చేస్తే క్రేజీగా ఉంటుందని భావించింది. ఆమె స్నేహితుడు వాహనం నడుపుతుంటే.. ఆమె ఆ వాహనం టాప్ మీద కూర్చుని వానలో ఫోన్‌లో సెల్ఫీలు దిగుతూ మురిసిపోయింది. ఆ డేంజరస్ స్టంట్‌ను ఆ దారినపోయే కొందరు వీడియో తీశారు. దానిని నెట్టింట వదిలారు అంతే..
గురుగ్రామ్ పోలీసులు ఆ వీడియోకు స్పందించారు. జాతీయ హైవే 48 మీద ఆ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ రీల్ స్టంట్ కోసం వాడిన వాహనాన్ని సీజ్ చేశారు. తనకు తెలియకుండా తన కొడుకు తన కారును తీసుకెళ్లాడని ఆ తండ్రి చెబుతున్నాడు. కారు నడిపిన ఆ యువకుడు, పైన కూర్చున్న అమ్మాయి ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో వాళ్లను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతారో తెలియదుగానీ.. కటకటాలు మాత్రం లెక్కించాల్సి వస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Gurugram’s viral stunt turns into trouble! 🚨
Man seen hanging out of moving Thar in rain — police launch investigation.#thejournalists #newsupdate #Gurugram #ViralVideo #TharStunt #TrafficRules #RoadSafety #PoliceInvestigation #HaryanaNews #DangerousDriving pic.twitter.com/LxkmoPM1Nj— The Journalists News (@TheJournalists_) August 8, 2025