వీడియో: దారుణం.. పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేశాడని.. ప్లేట్లు కడిగించారు

Gatecrashes Wedding Leads To wash dishes For Student Viral - Sakshi

వైరల్‌: పిలవని పెళ్లికి వెళ్లిన ఓ హాస్టల్‌ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రీగా తిన్నాడని అతనితో బలవంతంగా ప్లేట్లు కడిగించారు అక్కడున్న కొందరు. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

ఫ్రీగా తింటే దానికి శిక్ష ఏంటో తెలుసా?..  మీ ఇంట్లోలాగే ఇక్కడ ప్లేట్లు సరిగ్గా కడుగు అంటూ అతని ఎదురుగా ఉన్న వ్యక్తి  చెప్తూ ఉండగా.. వీడియో రికార్డు అయ్యింది. ఎందుకు వచ్చావ్‌? అసలు ఎవడు పెళ్లికి పిలిచాడు నిన్ను.. ఫ్రీగా తినడానికి వచ్చావా?.. ఇదే నీకు సరైన శిక్ష అంటూ వాయిస్‌ వినిపిస్తుంది ఆ వీడియోలో. బాధిత యువకుడిది జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌)గా తేలింది. భోపాల్‌కి చదువు కోసం వచ్చాడట.

‘‘ఎంబీఏ చదువుతున్నావ్. నీ తల్లిదండ్రులు నెల నెలా డబ్బు పంపడం లేదా?. నువ్వు ఇలా చేయడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంటూ అతన్ని మందలిస్తున్నారు మరికొందరు. 

కొసమెరుపు ఏంటంటే.. తీరా ప్లేట్లు కడిగాక ‘ఎలా అనిపిస్తోంది’ అంటూ కొందరు అతన్ని అడిగారు. ఫ్రీగా తిన్నప్పుడు.. ఏదో ఒక పని చేయాల్సిందే కదా అంటూ సమాధానం ఇచ్చాడు ఆ స్టూడెంట్‌. ఇలా పిలవని ఫంక్షన్‌లకు, కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయడం మామూలు కావొచ్చు. కానీ, దానికే ఇలా ప్లేట్లు కడిగించి మరీ వీడియోలు తీయడం, ఆ విద్యార్థిని అలా అవమానించడం సరికాదంటున్నారు చాలామంది. 

ఇదిలా ఉంటే.. అదే సమయంలో మరో వీడియో కూడా తెగ వైరల్‌ అవుతోంది. బీహార్‌లో ఇలాగే పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేసిన ఓ హాస్టల్‌ విద్యార్థి.. ఏకంగా పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే..  ఆ విద్యార్థి బాధను అర్థం చేసుకున్న ఆ పెళ్లి కొడుకు.. పర్వాలేదని, మరికొంత భోజనం హాస్టల్‌లో ఉన్న అతని స్నేహితులకు సైతం తీసుకెళ్లమని సూచిస్తాడు.

ఇదీ చూడండి: పేగుబంధం పక్కన పెట్టి.. కొడుకును పోలీసులకు పట్టించింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top