
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షహదరాలో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీ రామ్ రోడ్డులోని ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం నుంచి రెండు కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
కాగా గత ఆదివారం.. ఓల్డ్ రాజేందర్‌నగర్‌లోని బడాబజార్ రోడ్డులోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు.