Falaknuma Express Accident: Few Things About Falaknuma Express Train - Sakshi
Sakshi News home page

ఎప్పుడూ రద్దీనే.. ఎందుకో తెలుసా? ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ గురించి కొన్ని విషయాలు..

Jul 7 2023 3:24 PM | Updated on Jul 7 2023 3:47 PM

Falaknuma Express Accident: How Name Origin Train History Details - Sakshi

నిత్యం నడిచే ఈ రైలు ఎప్పుడూ రద్దీ ఎందుకు ఉంటుందో.. 

అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ Falaknuma Express ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్‌ తల్లిని ఆరాలు తీస్తున్నారు.


ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్‌ నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్‌నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని. 

🚆 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.

🚆 1993 అక్టోబర్‌ 15వ తేదీన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలి సర్వీస్‌ పట్టాలెక్కింది.  

🚆హౌరా జంక్షన్‌ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌ జంక్షన్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది.

🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది.

🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్‌, అలాగే 12704 సికింద్రాబాద్‌-హౌరా రూట్‌లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్‌ ముగిస్తుంది. 

🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్‌లలో ఈ రైలు ఆగడం.

🚆 సికింద్రాబాద్‌-హౌరా మధ్యలో 24 స్టేషన్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్‌, ఏసీ త్రీ టైర్‌, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లు ఉంటాయి. క్యాటరింగ్‌ సౌకర్యమూ ఉంది. 

🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్‌లను కలిగి ఉంటుంది.

🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్‌, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దా రోడ్‌ జంక్షన్‌, భువనేశ్వర్‌, కటక్‌ జంక్షన్‌, భద్రక్‌, బాలాసోర్‌(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్‌పూర్‌ జంక్షన్‌, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్‌లలో హాల్టింగ్‌ ఉంది.

🚆గతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్‌-తిరుపతి) రేక్స్‌(కోచ్‌లను)  మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్‌-మన్మాడ్‌(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది. 

🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్‌ చేస్తుంది భారతీయ రైల్వేస్‌. అందుకే ప్రయాణికులు ఈ రూట్‌లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తు‍న్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్‌ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం.

ఇదీ చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement