‘తీవ్రమైన పేదరికం’  తగ్గుముఖం | Extreme poverty in India down to 5. 3percent in 2022-23 says World Bank | Sakshi
Sakshi News home page

‘తీవ్రమైన పేదరికం’  తగ్గుముఖం

Jun 8 2025 5:36 AM | Updated on Jun 8 2025 5:36 AM

Extreme poverty in India down to 5. 3percent in 2022-23 says World Bank

భారత్‌లో పదేళ్లలో 16.2 నుంచి 2.3 శాతానికి తగ్గుదల  

ప్రపంచ బ్యాంకు నివేదిక  

న్యూఢిల్లీ:  భారతదేశంలో ‘తీవ్రమైన పేదరికం’రేటు క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. 2011–12లో పేదరికం రేటు 16.2 శాతం ఉండగా, పదేళ్ల తర్వాత 2022–23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. రోజుకు 3 డాలర్లు (రూ.257) సంపాదిస్తే పేదలు కానట్లేనని ప్రపంచ బ్యాంకు గతంలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. 

రోజుకు 2.15 డాలర్లు సంపాదిస్తే పేదలు కాదనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో 3 డాలర్లకు పెంచారు. ఇండియాలో 2011–12లో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) 34 కోట్ల మంది ఉండగా, 2022–23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది.  

→ 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన 3 డాలర్ల కంటే తక్కువే ఉంది. ఈ లెక్కన 
తీవ్రమైన పేదరికం రేటు 5.44 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు 
లెక్కగట్టింది.  
→ ఉచితం లేదా రాయితీతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తుండడం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతోంది.  
→ అలాగే పేదరికం విషయంలో పల్లెలు–పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతుండడం మరో కీలక పరిణామం.  
→ అత్యంత పేదల్లో 54 శాతం మంది ఐదు అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు.  
→ 2011–12 నుంచి 2022–23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు.  
→ ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. పల్లెలు–పట్టణాల మధ్య అంతరం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement