టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు | ECI recognises TVK as State party | Sakshi
Sakshi News home page

టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు

Sep 11 2026 6:12 AM | Updated on Sep 11 2026 6:12 AM

ECI recognises TVK as State party

సాక్షి, చెన్నై :   ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక గుర్తింపునిచ్చింది. దీనితోపాటు విజిల్‌ గుర్తును టీవీకే పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా కేటాయించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే అత్యధికంగా 108 స్థానాలలో విజయం సాధించింది. 

దీని ఆధారంగా ఎన్నికల సంఘం టీవీకేని తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారిక ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. దీంతో తమిళనాడులో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 7వ రాష్ట్ర పార్టీగా టీవీకే నిలిచింది. టీవీకే పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడం ప్రజల మద్దతుతోనే సాధ్యమైందని తమిళనాడు సీఎం విజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement