ఆప్‌ సర్‌ప్రైజ్‌.. ఎంపీగా కేజ్రీవాల్? | Did AAP Arvind Kejriwal Goes Parliament Here Is The Actual Truth | Sakshi
Sakshi News home page

ఆప్‌ సర్‌ప్రైజ్‌.. ఎంపీగా అరవింద్‌ కేజ్రీవాల్?

Feb 26 2025 12:15 PM | Updated on Feb 26 2025 1:23 PM

Did AAP Arvind Kejriwal Goes Parliament Here Is The Actual Truth

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్‌ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్‌ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్‌ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్‌ స్కామ్‌’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..

పంజాబ్‌ లూథియానా వెస్ట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్‌ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్‌ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు  అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్‌.  

సంజీవ్‌ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్‌ తరఫున పంజాబ్‌ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి..  ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్‌ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్‌ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.

అందుకేనా సమీక్షలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్‌ ఆప్‌ కేడర్‌తో కేజ్రీవాల్‌ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్‌ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement