భారతీయ దుస్తుల్లో ఎందుకొచ్చారు?.. జంటకు రెస్టారెంట్‌లోకి నో ఎంట్రీ! | Delhi Restaurant Denies Entry To Couple In Indian Attire, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

భారతీయ దుస్తుల్లో ఎందుకొచ్చారు?.. జంటకు రెస్టారెంట్‌లోకి నో ఎంట్రీ!

Aug 9 2025 8:04 AM | Updated on Aug 9 2025 11:55 AM

Delhi Restaurant Denies Entry To Couple For Indian Attire

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. భారతీయ వస్త్రధారణతో రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో వెళ్లిన కారణంగా వారిని రెస్టారెంట్‌లోకి అనుమతించ లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై రెస్టారెంట్‌ యాజమాన్యం స్పందిస్తూ.. వింత సమాధానం ఇవ్వడం గమనార్హం.

వివరాల ప్రకారం.. ఢిల్లీలో పితాంపురలో ఉన్న రెస్టారెంట్‌కి ఓ జంట డిన్నర్‌కు వెళ్లారు. భారతీయ వస్త్రధారణతో వారిద్దరూ వెళ్లడంతో సదరు రెస్టారెంట్‌ జంటకు లోపలికి అనుమతించలేదు. సిబ్బంది అనుమతి నిరాకరించారు. రెస్టారెంట్‌లోకి ఇతరులను అనుమతించగా.. తమతో మాత్రం మేనేజర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. దీంతో, వారికి ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అనంతరం, ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని మంత్రి కపిల్‌ మిశ్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై రెస్టారెంట్‌ యజమానులు కస్టమర్స్‌కు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించరని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై రెస్టారెంట్‌ యజమాని నీరజ్‌ అగర్వాల్ స్పందించారు. తమ రెస్టారెంట్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవంటూ తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్‌ బుక్‌ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చారు. రెస్టారెంట్‌లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదన్నారు. కస్టమర్స్‌ అందరికీ ఆహ్వానం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్‌ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఇలా ప్రవర్తించే రెస్టారెంట్‌లను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement