చెవిలో గుసగుసలు.. నెటిజన్ల ప్రశంసల వర్షం! | Delhi Cop Praised for Graceful Handling of Transgender Protester | Sakshi
Sakshi News home page

చెవిలో గుసగుసలు.. నెటిజన్ల ప్రశంసల వర్షం!

Oct 7 2026 4:58 PM | Updated on Oct 7 2026 5:18 PM

Delhi Cop Praised for Graceful Handling of Transgender Protester

సాక్షి,న్యూఢిల్లీ: చేసే పని చిన్నదైనా సంయమనం పాటిస్తే ఫలితం పెద్దగా ఉంటుందని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన తాజా ఘటనే నిరూపించింది. ఢిల్లీలో నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఐపీఎస్‌ మహిళా పోలీస్ అధికారి చూపిన సంయమనం, హుందాగా వ్యవహరించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ ఏడాది జులై నెలలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో ఆందోళనకారుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేస్తూనే, నిరసనలను అదుపు చేసే క్రమంలో పోలీసులు అత్యంత సంయమనంతో, చట్టబద్ధంగా వ్యవహరించాలని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో తాజాగా న్యూఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ రద్దు, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్ చేస్తూ యువత పెద్దఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్న చందంగా వ్యవహరించారు.

జంతర్ మంతర్ వద్ద ఏం జరిగింది?
జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోబోతుండగా..  మేడం మీరు నన్ను నిర్బంధించలేరు. నేనొక జర్నలిస్టును. నా దగ్గర ఐడీ కార్డు కూడా ఉంది అని చెప్పారు.

అక్కడ ఆ మహిళా పోలీసు అధికారి అత్యంత సంయతనంతో, ఎంతో గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ వ్యక్తి జెండర్ గుర్తింపును గౌరవిస్తూ, ఎంతో హుందాగా ఆయన చెవిలో వంగి.. మేం మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని అదుపులోకి తీసుకునేందుకు మగ పోలీసు కావాలా?.. ఆడ పోలీస్ కావాలా?’ అని అడిగిన తీరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

వైరల్ వీడియో వెనుక  
ఈ సంభాషణ కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే సాగింది. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నిరసనకారులను అక్కడి నుంచి సురక్షితంగా దూరంగా తరలించారు. నిరసనకారుడి గుర్తింపును బహిరంగంగా ఇబ్బంది పెట్టకుండా, అత్యంత విచక్షణతో ఆ మహిళా అధికారి వ్యవహరించిన తీరును నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు . అయితే ఆ వీడియోలో ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఎక్కడికి తరలించారు. సదరు పోలీస్‌ అధికారి పేరు, వివరాల్ని తెలియరాలేదు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement