లిక్కర్‌ పాలసీ కేసు: కోర్టుకు హాజరైన సీఎం కేజ్రీవాల్‌, కానీ..

Delhi CM Arvind Kejriwal appears before court via video conferencing - Sakshi

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆయన వర్చువల్‌గా రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు కేజ్రీవాల్‌ దరఖాస్తుకు ఈడీ తరఫున న్యాయవాది ఏఎస్‌జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తంచేయలేదు. దీంతో.. మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. 

మరో లిక్కర్‌ కేసులో..  మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందింగా కేజ్రీవాల్‌ కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. అంతకు ముందు ఆయనకు ఐదుసార్లు జారీ చేసినా విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో.. ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా? అనే సస్పెన్స్‌ నెలకొంది. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top