గుజరాత్‌కు ‘బిపర్‌జోయ్‌’ ముప్పు లేనట్లే: ఐఎండీ | Cyclone Biparjoy Set to Intensify in Next 24 Hours | Sakshi
Sakshi News home page

గుజరాత్‌కు ‘బిపర్‌జోయ్‌’ ముప్పు లేనట్లే: ఐఎండీ

Jun 11 2023 6:04 AM | Updated on Jun 13 2023 6:38 PM

Cyclone Biparjoy Set to Intensify in Next 24 Hours - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌కు ‘బిపర్‌జోయ్‌’ తుపాను ముప్పుతప్పినట్లేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుపాను మరో 12 గంటల్లో అత్యంత భీకర తుపానుగా మారే ప్రమాదముందని తెలిపింది. ప్రస్తుతం ఇది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగాను, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉత్తర–వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీంతో, వచ్చే అయిదు రోజుల్లో గుజరాత్‌కు తుపాను ముప్పు తప్పినట్లేనని వెల్లడించింది. దీని ప్రభావంతో కచ్‌–సౌరాష్ట్ర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement