అటల్‌ సేతుకి పగుళ్లా?..అందులో నిజమెంత? Cracks On Atal Setu, Maharashtra Congress chief Nana Patole. BJP Clarified on cracks on Atal Setu. Sakshi
Sakshi News home page

అటల్‌ సేతుకి పగుళ్లా?..అందులో నిజమెంత?

Published Fri, Jun 21 2024 9:04 PM | Last Updated on Sat, Jun 22 2024 8:56 AM

Cracks On Atal Setu, Alleges Mumbai Vs Bjp

ముంబై : రాకపోకలు ప్రారంభించిన నెలల వ్యవధిలో అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడ్డాంటూ మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు‌ నానా పటోలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడిన ప్రాంతానికి మీడియాను వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అటల్‌ సేత నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.

వంతెన నిర్మాణంలో నాణ్యతలేదు. కాబట్టే పగుళ్లు ఏర్పడ్డాయని, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కర్రతో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అటల్ సేతు వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల్లో ఒక భాగం పగుళ్లు ఏర్పడింది. నిర్మాణ కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది అని అన్నారు.  

అయితే, బీజేపీతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) మాత్రం ఈ పగుళ్లు బ్రిడ్జిపైన కాకుండా నవీ ముంబైలోని ఉల్వే రహదారిపై ఏర్పడ్డాయని పేర్కొంది.

ఈ సందర్భంగా ఎంటీహెఎల్‌ వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయని పుకార్లు వ్యాపించాయి. ఈ పగుళ్లు బ్రిడ్జిపైనే కాకుండా ఉల్వే నుండి ముంబై వైపు ఎంటీహెచ్‌ఎల్‌ని కలిపే రోడ్డుపైనే ఏర్పాడ్డాయని గుర్తించాలని అని ఎంఎంఆర్‌డీఏ తెలిపింది.  

అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి అంటూ బీజేపీ ఎక్స్‌ వేదికగా స్పందించింది. ఇది సర్వీస్ రోడ్డు. ఇది ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం. ఇవి చిన్నపాటి పగుళ్లు. రేపు సాయంత్రంలోగా వాటిని సరిచేస్తాం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడలేదు అని అటల్‌ సేతు ప్రాజెక్ట్‌ హెడ్‌ కైలాష్ గణత్ర తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement