4 నెల‌ల త‌ర్వాత‌.. 30 వేల లోపు కరోనా కేసులు | Corona Updates: New 29163 Cases Repoprted In India | Sakshi
Sakshi News home page

భారత్‌: దేశంలో కొత్తగా 29,163 కరోనా కేసులు

Nov 17 2020 10:22 AM | Updated on Nov 17 2020 6:55 PM

Corona Updates: New 29163 Cases Repoprted In India - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి. మరణాల సంఖ్య 1,30,519కు చేరాయి. ప్రస్తుతం 4,53,401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సోమవారం దేశంలో 40,791 మంది కోలుకోగా ఇప్పటి వరకు 82,90,370 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో 93 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 1.47గా ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల శాతం 5.11గా ఉంది. చదవండి: టోక్యో ఒలింపియన్లకు వ్యాక్సిన్‌! 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement