నేడు కాంగ్రెస్‌ కీలక భేటీలు | Congress convenes CWC meeting 8 june in Delhi | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ కీలక భేటీలు

Jun 8 2024 5:12 AM | Updated on Jun 8 2024 5:13 AM

Congress convenes CWC meeting 8 june in Delhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) కీలక సమావేశం శనివారం ఢిల్లీలోని అశోక హోటల్‌లో జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ అగ్రనేతలు చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. 

సమావేశం తర్వాత విందు ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులు సైతం ఈ భేటీలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాం«దీని ఎన్నుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement