చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్  | Sakshi
Sakshi News home page

చెన్నైలో బీజేపీ నేత అరెస్టు.. మాయమాటలు చెప్పి మూడు పెళ్లిళ్లు..

Published Tue, Aug 8 2023 9:46 AM

Chemmai BJP Leader Arrested On Allegations Of Three Mariages - Sakshi

చెన్నై: బీజేపీ నేత కళ్యాణసుందరం తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడంటూ అతని రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పులళ్ సెంట్రల్ జైలుకు తరలించారు చెన్నై పోలీసులు. 

బీజేపీ నేత కళ్యాణసుందరం గతంలోనే 3 పెళ్లిళ్లు చేసుకున్నారని ఆ విషయాన్ని ఇన్నాళ్లు చెప్పకుండా దాచి, మాయమాటలు చెప్పి తనను మోసం చేశారంటూ ఆయన రెండో భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కళ్యాణసుందరంపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. జడ్జి ముందు హాజరుపరచి పులళ్ సెంట్రల్ జైలుకు తరలించారు. అదేమీ యాధృచ్చికమో గాని ఆంధ్రాలో లాగే తమిళనాడులో కూడా మూడు పెళ్లిళ్ల అంశం హాట్ టాపిక్ గా మారింది.    

నవాయి కాలపట్టు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే  కల్యాణసుందరం చెన్నై రామాపురానికి చెందిన ఎల్లమ్మాళ్ ను ప్రేమించి చెన్నై వడపళని మురుగన్ కోవిల్లో రెండో వివాహం చేసుకున్నారు. మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి తెలియగానే ఆమె 2018లో మొదట మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే వ్యవహారంపై ఆమె పోలీసులను ఆశ్రయించగా వారు వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు.  

ఇది కూడా చదవండి: జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..

Advertisement
 
Advertisement