
పాట్నా: రూ.12 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. బీహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై కుర్సకాంత -సిక్తి మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ప్రభుత్వం రూ.12 కోట్లతో బ్రిడ్జిని నిర్మించింది. ప్రారంభోత్సవానికి సిద్దమైంది. అయితే అనూహ్యంగా ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి కూలిపోయింది.విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బ్రిడ్జి కూలిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జ్ కూలిపోతుందనే ముందస్తు జాగ్రత్తతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ప్రాణపాయం తప్పింది.
#WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3
— ANI (@ANI) June 18, 2024