నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ | BJP Claims Accused was seen with TMCs Abhishek Banerjee | Sakshi
Sakshi News home page

నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ

Jun 28 2025 12:21 PM | Updated on Jun 28 2025 3:37 PM

BJP Claims Accused was seen with TMCs Abhishek Banerjee

కోల్‌కతా: లా విద్యార్ధిని గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు.. టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ బీజేపీ నేతలు అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 26న  సౌత్ కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే చోటుచేసుకున్న తాజా ఉదంతం బెంగాల్‌లో మరోమారు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఈ కేసులోని నిందితులకు, టీఎంసీ అగ్ర నేతలకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ)పై విమర్శల దాడి ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి, పార్టీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియాలు తాజాగా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్యతో సహా పలువురు టీఎంసీ నేతల పక్కన నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో ఒక పోస్టులో షేర్‌ చేశారు.
 

‘మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. మనోజిత్ మిశ్రా టీఎంసీ సభ్యుడు అని బీజేపీ నేత భండారి పేర్కొన్నారు. టీఎంసీ నిందితులను కాపాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎందుకు మౌనం? ఎవరిని కాపాడుతారు?” అని బీజేపీ నేత మాల్వియా ప్రశ్నించారు. మమతా బెనర్జీ పాలన.. బెంగాల్ మహిళలకు ఒక పీడకలగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలకు స్పందించిన టీఎంసీ మహిళా నేత  శశి పంజా ఈ ఘటనను ఖండించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.  ఇది తనకు  ఎంతో బాధ కలిగించిందని, ఈ కేసలో నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.  ఈ ఘటనపై ఫిర్యాదు  అందిన 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని, వారి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారని  ఆమె తెలిపారు.



ఇది  కూడా చదవండి: ఫరీదాబాద్‌ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం 

Advertisement
 
Advertisement
Advertisement