
న్యూఢిల్లీ: ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఆయన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బిర్జూ మహరాజ్ తన మనవళ్లతో గడుపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బిర్జూ మహరాజ్ బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలైన ఉమ్రాన్ జాన్, దేవదాస్, బాజీరావ్ మస్తానీ తదితర చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు.
ప్రధాని మోదీ సంతాపం
భారతీయ నృత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పండిట్ బిర్జూ మహారాజ్ జీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటు. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
भारतीय नृत्य कला को विश्वभर में विशिष्ट पहचान दिलाने वाले पंडित बिरजू महाराज जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना संपूर्ण कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति! pic.twitter.com/PtqDkoe8kd
— Narendra Modi (@narendramodi) January 17, 2022
చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..)