CoronaVirus Vaccine: నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు..

Jharkhand Man Starts Walking, Speaking after Receiving COVID Vaccine - Sakshi

Jharkhand: కరోనా వ్యాక్సిన్‌ ఓ మనిషికి కోల్పోయిన జీవితాన్ని ప్రసాదించింది. జార్ఖండ్‌లోని బొలారో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్లుగా మంచానపడ్డాడు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తాను మళ్లీ నడవడం ప్రారంభించాడు. వివరాల్లోకెళ్తే.. 44 ఏళ్ల వయసు గల దులార్‌చంద్ నాలుగేళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత అతను గొంతు కోల్పోయాడు. మంచానికే పరిమితమయ్యాడు.

'దులార్‌చంద్‌ జనవరి 4న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను వేయించుకున్నాడు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఒక రోజు తర్వాత అతని శరీరం స్పందించడం ప్రారంభించింది. అనంతరం తను కోల్పోయిన స్వరం, తిరిగి లేచి నడవడం ప్రారంభించాడ'ని బొకారోలోని పెటార్‌వార్ గ్రామంలోని పెటార్‌వార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అల్బెల్ కెర్కెట్టా తెలిపారు. 

చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..)

దీనిపై దులార్‌చంద్‌ స్పందిస్తూ.. 'వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జనవరి 4న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కాళ్లపై నిలబడగలుగుతున్నాను. కోల్పోయిన స్వరాన్ని కూడా తిరిగి పొందాను' అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే బొకారో సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన ఆశ్చర్యం కలిగించినా, అద్భుతమేమీ కాదన్నారు. దులార్‌చంద్‌ వైద్య చరిత్రను పరిశీలించేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్‌ జితేంద్రకుమార్‌ ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top