బీజాపూర్‌ అడవుల్లో.. భారీ మావోయిస్టుల డంప్‌ | Bijapur Maoist Arms Dump Seized: Chinese Grenades and Rifles Recovered | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌ అడవుల్లో.. భారీ మావోయిస్టుల డంప్‌

Sep 22 2026 8:00 PM | Updated on Sep 22 2026 9:01 PM

Bijapur Maoist Arms Dump Seized: Chinese Grenades and Rifles Recovered

రాయిపూర్: బీజాపూర్‌లోని ఉట్లా అడవిలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవలే లొంగిపోయిన కేడర్ల నుండి అందిన నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించగా పెద్దఎత్తున ఆయుధాల డంప్‌ దొరికింది. అందులో చైనాకు సంబంధించిన ఆయుధాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

బైరామ్‌ ఘడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉట్లా గ్రామ పరిధిలో  సెప్టెంబర్‌ 20న అధికారులు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమచారం ఆధారంగా అనుమానిత ప్రదేశంలో త్రవ్వగా పెద్దఎత్తున ఆయుధాల డంప్‌ దొరికినట్లు పేర్కొన్నారు.  చైనా హ్యాండ్ గ్రెనేడ్ 49 లైవ్ SLR రౌండ్లు, 15 రౌండ్ల .315 బోర్, BGL కార్ట్రిడ్జ్‌లు 15, నాలుగు SLR మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దానితో పాటు 315 బోర్ మ్యాగజైన్ , SLR/ LMG రైఫిల్ అనేది, INSAS రైఫిల్ అనేది, 315 బోర్ గన్, BGL లాంచర్ 2, BGL సెల్ 17 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుల ఆయుధాల స్వాధీన పరచుకోవడం కోసం భద్రతబలగాలు పెద్దఎత్తున సెర్చ్ ఆఫరేషన్‌ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా అడవిలో మైన్ల తొలగింపు తదితర చర్యలు చేపడుతున్నాయి.

ఈ నెల ప్రారంభంలో బీజాపూర్‌ పిడియా, కుప్పగూడ ప్రాంతాలలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 14 మావోయిస్టుల డంప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల కాలంలో కేంద్రబలగాలు మావోయిస్టులపై పెద్దఎత్తున ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా మావోయిస్టుల కీలక నేతలను కేంద్రబలగాలు అంతమెుందించాయి. ఈ నేపథ్యంలో పెద్దమెుత్తంలో అగ్రనాయకులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement