breaking news
chattsigargh
-
బీజాపూర్ అడవుల్లో.. భారీ మావోయిస్టుల డంప్
రాయిపూర్: బీజాపూర్‌లోని ఉట్లా అడవిలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవలే లొంగిపోయిన కేడర్ల నుండి అందిన నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా పెద్దఎత్తున ఆయుధాల డంప్ దొరికింది. అందులో చైనాకు సంబంధించిన ఆయుధాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.బైరామ్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉట్లా గ్రామ పరిధిలో సెప్టెంబర్ 20న అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమచారం ఆధారంగా అనుమానిత ప్రదేశంలో త్రవ్వగా పెద్దఎత్తున ఆయుధాల డంప్ దొరికినట్లు పేర్కొన్నారు. చైనా హ్యాండ్ గ్రెనేడ్ 49 లైవ్ SLR రౌండ్లు, 15 రౌండ్ల .315 బోర్, BGL కార్ట్రిడ్జ్లు 15, నాలుగు SLR మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.దానితో పాటు 315 బోర్ మ్యాగజైన్ , SLR/ LMG రైఫిల్ అనేది, INSAS రైఫిల్ అనేది, 315 బోర్ గన్, BGL లాంచర్ 2, BGL సెల్ 17 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుల ఆయుధాల స్వాధీన పరచుకోవడం కోసం భద్రతబలగాలు పెద్దఎత్తున సెర్చ్ ఆఫరేషన్ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా అడవిలో మైన్ల తొలగింపు తదితర చర్యలు చేపడుతున్నాయి.ఈ నెల ప్రారంభంలో బీజాపూర్ పిడియా, కుప్పగూడ ప్రాంతాలలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 14 మావోయిస్టుల డంప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల కాలంలో కేంద్రబలగాలు మావోయిస్టులపై పెద్దఎత్తున ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టుల కీలక నేతలను కేంద్రబలగాలు అంతమెుందించాయి. ఈ నేపథ్యంలో పెద్దమెుత్తంలో అగ్రనాయకులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
రూ.8 లక్షల రివార్డు.. చెల్లి కోసం లొంగిపోయాడు
రాయ్‌పూర్: రాఖీ పండగ అనేది ప్రధానంగా తోబుట్టువుల పండుగ. ఒకరి క్షేమం ఒకరు కోరుతూ జరుపుకునే పండుగ. ఆడపడుచు.. నిండు నూరేళ్లు తన సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది. రక్ష కట్టించుకున్న సోదరులు జీవితాంతం వారికి తోడుగా ఉంటానని మాటిస్తారు. ఈ రాఖీ పండుగ నాడు.. రక్షా బంధన్ గొప్పతనాన్ని నిజం చేసే సంఘటన ఒకటి చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. నక్సలైట్‌గా మారి.. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ అన్నను.. రాఖీ కట్టి.. జనజీవన స్రవంతిలో కలిసేలా చేసింది అతడి సోదరి. వివరాలు.. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. (రక్షాబెహన్) గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తన అన్నయ్య ఇంటికి రావాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది లింగే. ఈ క్రమంలో 2016లో మల్లా, ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ అయ్యాడు. భైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండర్‌గా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తోన్న లింగే.. దీనితో మరింత భయాందోళనకు గురయ్యింది. హిట్ లిస్ట్‌లో చేరిన తన సోదరుడు ఏదో ఒక రోజు పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకుది. (సోదరులకు రక్షాపూర్ణిమ) ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. -
17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వేటు
న్యూఢిల్లీ: చత్తీస్‌గడ్‌లో గత మార్చిలో జరిగిన ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి 17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ దుర్ఘటనలో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని విచారణలో తేలింది. దీంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకున్నారు.


