తృటిలో తప్పిన రైలు ప్రమాదం | Bihar Major Rail Accident Averted In Purnia, Passengers Lives Saved In This Incident | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Oct 23 2024 9:51 AM | Updated on Oct 23 2024 10:58 AM

Bihar Rail Accident in Purnia

పూర్ణియా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్‌పీ ఫోర్స్‌ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్‌ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్‌పై రాడ్‌ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.
 

ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే 

Advertisement
 
Advertisement
Advertisement